Loading...
Kia Seltos: 2026 కియా సెల్టోస్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. భద్రతలో మరోసారి సత్తా!
2026 కియా సెల్టోస్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. భద్రతలో మరోసారి సత్తా!

Kia Seltos: 2026 కియా సెల్టోస్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. భద్రతలో మరోసారి సత్తా!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న Kia Seltos మరోసారి తన ప్రతిభను నిరూపించింది. భద్రత విషయంలో ఈ ఎస్‌యూవీ కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది. Bharat NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 2026 కియా సెల్టోస్ అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.70 పాయింట్లు సాధించడం విశేషం. ఇక చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 49లో 45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇది సెల్టోస్ భద్రతా ప్రమాణాలను మరింత బలపరిచింది.

వివరాలు 

టెస్ట్ వివరాలు.. ఎలా పరీక్షించారు?

భారత్ ఎన్‌సీఏపీ ఈ క్రాష్ టెస్టుల కోసం సెల్టోస్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్లైన హెచ్‌టీఈ (ఓ), జీటీఎక్స్ వేరియంట్లను ఉపయోగించింది.

అయితే ఈ రేటింగ్ సెల్టోస్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇటీవల పరీక్షించిన Tata Sierra కంటే సెల్టోస్ స్వల్పంగా ఎక్కువ స్కోరు సాధించింది.

ముఖ్యంగా ఐసీఈ వాహనాల్లో అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

వివరాలు 

పెద్దల రక్షణలో అద్భుత ఫలితాలు

2026 కియా సెల్టోస్ అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది:

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్: 16లో 15.70 పాయింట్లు

సైడ్ మూవబుల్ టెస్ట్: 16లో 16 పాయింట్లు (పర్ఫెక్ట్ స్కోరు)

డ్రైవర్‌కు తల, ఛాతీ, పెల్విస్, తొడలు, కాలి భాగాలకు అత్యుత్తమ రక్షణ లభించింది.

అయితే రెండు పాదాలు, ఎడమ కాలి దిగువ భాగానికి తగినంత రక్షణ మాత్రమే ఉంది.

కో-డ్రైవర్‌కు సంబంధించిన అన్ని ముఖ్య భాగాలకు పూర్తి రక్షణ లభించడం మరో ప్లస్ పాయింట్. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులో కూడా డ్రైవర్, కో-డ్రైవర్ ఇద్దరికీ తల నుంచి పెల్విస్ వరకు పూర్తి భద్రత అందినట్లు నివేదికలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు 

చిన్నారుల భద్రతలోనూ సత్తా

చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా సెల్టోస్ మెరుగైన ఫలితాలు సాధించింది:

డైనమిక్ స్కోరు: 24/24 (పూర్తి మార్కులు)

చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్: 12/12 (పర్ఫెక్ట్)

18 నెలలు, 3 ఏళ్ల వయస్సు గల డమ్మీలతో నిర్వహించిన ఫ్రంటల్ (8/8), సైడ్ (4/4) టెస్టుల్లో కూడా పూర్తి స్కోరు సాధించింది.

అయితే వెహికల్ అసెస్‌మెంట్‌లో 13లో 9 పాయింట్లు రావడంతో మొత్తం స్కోరు 45కు పరిమితమైంది.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతా ఫీచర్లు.. స్టాండర్డ్‌గా ఇవన్నీ!

కియా సెల్టోస్ బేస్ వేరియంట్ నుంచే బలమైన సేఫ్టీ ప్యాకేజీ అందిస్తోంది:

స్టాండర్డ్ ఫీచర్లు:

6 ఎయిర్‌బ్యాగ్‌లు

రియర్ పార్కింగ్ సెన్సార్లు

రియర్ వ్యూ కెమెరా

ఏబీఎస్ టైర్

ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

అదనపు ఫీచర్లు:

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

హిల్ స్టార్ట్ అసిస్ట్

డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్

ఇతర ముఖ్య ఫీచర్లు:

అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు

రియర్ ఆక్యుపెంట్ అలర్ట్

ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్

వివరాలు 

ధర, పోటీ మోడళ్లు

2026 కియా సెల్టోస్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మార్కెట్లో ఇది Hyundai Creta, Maruti Suzuki Grand Vitara, Honda Elevate, Skoda Kushaq, Volkswagen Taigun వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

భద్రత విషయంలో రాజీ పడని వినియోగదారులకు 2026 కియా సెల్టోస్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. అత్యుత్తమ సేఫ్టీ స్కోర్లు, అధునాతన ఫీచర్లు కలగలిపి ఈ ఎస్‌యూవీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది.

ADVERTISEMENT