Page Loader
Komaki Ranger electric bike : అప్డేటెడ్​ వర్షెన్ ఎలక్ట్రిక్​ బైక్ తీసుకొచ్చిన కొమాకి రేంజర్​.. సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్ 
అప్డేటెడ్​ వర్షెన్ ఎలక్ట్రిక్​ బైక్ తీసుకొచ్చిన కొమాకి రేంజర్​.. సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్

Komaki Ranger electric bike : అప్డేటెడ్​ వర్షెన్ ఎలక్ట్రిక్​ బైక్ తీసుకొచ్చిన కొమాకి రేంజర్​.. సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ తమ అత్యంత విక్రయాల్ని సాధించిన రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను తాజా వెర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త రేంజర్ బైక్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి బేస్ మోడల్ కాగా, మరొకటి పూర్తిగా లోడెడ్ వేరియంట్. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.40 లక్షలు, రూ. 1.50 లక్షలుగా ఉంటాయి. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరలోని డీలర్‌షిప్ షోరూమ్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిందైన ఈ రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. మరి ఈ బైక్‌లో ఏమేం ప్రత్యేకతలున్నాయో చూద్దాం.

వివరాలు 

కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్.. ముఖ్యమైన అప్డేట్స్ 

కొమాకి సంస్థ తాజా వర్షన్ రేంజర్ బైక్‌కి నూతన తరం LiFePO4 బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. ఇది ఎక్కువ మన్నిక కలిగినదిగా ఉండటంతో పాటు, దీర్ఘ ప్రయాణాలకు మరింత అనువుగా ఉంటుంది. బైక్‌ రైడింగ్ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయబడిందని సంస్థ తెలిపింది. బైక్‌లో ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ విండ్‌స్క్రీన్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఇందులో మరింత సౌకర్యవంతమైన సీటు డిజైన్, 50-లీటర్ల అదనపు స్టోరేజ్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఫ్లేమ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ సౌండ్ పైప్స్ వంటివి సమకూర్చబడ్డాయి. ఈ బైక్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది.

వివరాలు 

వారంటీ వివరాలు 

కొమాకి సంస్థ ఈ రేంజర్ ఎలక్ట్రిక్ బైక్‌కు మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. దీనిలో బ్యాటరీ, మోటార్, కంట్రోలర్‌కు వర్తించే వారంటీ ఉంటుంది. అదనంగా, ఒక సంవత్సరం ఛార్జర్ వారంటీ కూడా ఇవ్వబడుతోంది.

వివరాలు 

కొమాకి సహ వ్యవస్థాపకుడి ప్రకటన 

"రేంజర్ మోడల్‌కు తాజా వర్షన్‌ను పరిచయం చేయడం ద్వారా మార్కెట్లో మరింత ప్రావేశం పొందాలన్నది మా లక్ష్యం. అధునాతన టెక్నాలజీతో, గొప్ప పనితీరుతో, పర్యావరణానుకూలతతో కూడిన ఈ మోడల్, 2025 సంవత్సరంలో బిగ్గెస్ట్ లాంచ్‌లలో ఒకటిగా నిలుస్తుంది. దీర్ఘ ప్రయాణాల కోసం అనువుగా రూపొందించబడిన ఈ బైక్ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ అవుతుందని మేము విశ్వసిస్తున్నాం" అని కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ వ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా అన్నారు.

వివరాలు 

ఇంకా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? 

మీరు ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని చూస్తే, వీఎల్‌ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ను పరిశీలించండి. ఇది 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు గంటలు పడుతుంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ప్రాక్టికల్ రేంజ్ కెపాసిటీ కలిగి ఉండటం దీనిని ప్రత్యేకతగా నిలబెడుతుంది.