
Electric scooter : కొమాకి ఎక్స్3.. సింగిల్ ఛార్జ్‌లో 100 కి.మీ రేంజ్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందించేందుకు 'కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్' ఇటీవల ఎక్స్3 ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసింది.
ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. కొమాకి ఎక్స్3 ప్రాక్టికల్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది.
ఇందులో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అందించారు.
డిజిటల్ డ్యాష్‌బోర్డ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, పార్కింగ్ రిపేర్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూటర్ గార్నెట్ రెడ్, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Details
బ్యాటరీ, పనితీరు
కొమాకి ఎక్స్3లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు.
ఇది 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ అవుతుంది.
పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
గంటకు గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
Details
ప్రారంభ ధర రూ.52,999
కొమాకి ఎక్స్3ను మహిళా రైడర్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించామని కంపెనీ తెలిపింది.
కొమాకి ఎలక్ట్రిక్ కో-ఫౌండర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ తమ కొత్త ఎక్స్3 సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాయకత్వం వహించడంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు.
సుస్థిరత, సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, రహదారిపై ప్రతి రైడర్‌కు సాధికారత కల్పించడానికి ఇది నిదర్శనంగా ఉంటుందని అన్నారు.
కొమాకి ఎక్స్3 ప్రారంభ ధర రూ. 52,999గా నిర్ణయించారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే SE, X-వన్, MG సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఎక్స్3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా వీటికి తోడైంది.