Komaki X3: రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా 100 కిమీలు
ఈ వార్తాకథనం ఏంటి
కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్ తన ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 52,999 (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో విడుదల చేసినట్లు ప్రకటించింది.
ఎస్‌ఈ,ఎక్స్-వన్, ఎంజీ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉన్న కొమాకి బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో తాజాగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ 3 చేరింది.
రూ. 99,999కే రెండు స్కూటర్లు
ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు,ఒక ప్రత్యేక ఆఫర్‌ను కూడా కొమాకి ప్రకటించింది.
ఎక్స్ 3 కొనుగోలు చేయదలచుకున్న వినియోగదారులు ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకుంటే,వారికి కేవలం రూ. 99,999కే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 'బై 2 ఎట్ రూ. 99,999' ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
వివరాలు
ప్రాక్టికల్ డిజైన్‌తో కోమాకి ఎక్స్ 3
ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుందని కోమాకి స్పష్టం చేసింది.
కోమాకి ఎక్స్ 3 ఫంక్షనల్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో కూడిన పూర్తి ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌ను కలిగి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ డ్యాష్‌బోర్డ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, పార్కింగ్ రిపేర్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు అందించబడినవి.
ఇది గార్నెట్ రెడ్, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది.
వివరాలు
లిథియం-అయాన్ బ్యాటరీ
కోమాకి ఎక్స్ 3లో శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందించబడింది.
ఇది 3 కిలోవాట్ల సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించబడింది.
పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
అదనంగా, ఇది గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా, కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహవ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, మహిళా రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.