Page Loader
KTM E-Duke: కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది
కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది

KTM E-Duke: కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ బైక్‌ల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ బైక్‌లను వరుసగా మార్కెట్లోకి విడుదల చేస్తుండగా, ఇప్పుడు ఆ జాబితాలో కేటీఎం (KTM) కూడా చేరేందుకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ తమ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలోనే విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే KTM తన రాబోయే ఎలక్ట్రిక్ స్ట్రీట్‌ఫైటర్ బైక్ అయిన KTM E-డ్యూక్ నమూనాను ప్రదర్శించింది. ఈ KTM E-డ్యూక్ బైక్‌లో 5.5kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. దీంట్లో 10kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

KTM E-డ్యూక్ బైక్‌ను 390 డ్యూక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి

కొన్ని నివేదికల ప్రకారం, ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శక్తి ఈ బైక్‌కి ఉండే అవకాశం ఉంది. ఈ KTM E-డ్యూక్ బైక్‌ను 390 డ్యూక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. దీనిలో ట్రేల్లిస్ ఫ్రేమ్,అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఆఫ్‌సెట్ రియర్ షాక్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాక, ఈ బైక్‌కు 390 డ్యూక్‌లో కనిపించే బ్రేక్‌లు మరియు వీల్ సెటప్‌ను వినియోగించారు. దీని డిజైన్‌ పూర్తిగా ఆధునిక దృక్పథంతో రూపొందించబడింది. ఇందులో బాడీ వర్క్ చాలా షార్ప్‌గా ఉండేలా చేశారు. కొత్త సబ్‌ఫ్రేమ్‌తో పాటు, దీంట్లో 990 డ్యూక్, 1390 సూపర్ డ్యూక్ మోడల్స్‌లో కనిపించే డీకన్‌స్ట్రక్టెడ్ హెడ్‌ల్యాంప్‌ను కూడా అందించారు.

వివరాలు 

MotoGP నుంచి ప్రేరణ పొందిన ఎయిర్ స్కూప్‌లు

అంతేకాక, KTM తయారు చేసిన e-ఎండ్యూరో బైక్‌లలో కనిపించే విధంగా ఈ బైక్‌లో వెడల్పు గల హ్యాండిల్ బార్, 4.3 అంగుళాల TFT డిస్ప్లే, స్కూటర్ తరహా రియర్ బ్రేక్ హ్యాండిల్ బార్‌ను కూడా పొందుపరిచారు. అదనంగా, MotoGP నుంచి ప్రేరణ పొందిన ఎయిర్ స్కూప్‌లు, 3D ప్రింటెడ్ సీటు వంటి ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి.