KTM RC 160-Yamaha R15: ట్రాక్ రేసింగ్'ను ఇష్టపడే యువతకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి KTMRC 160..యమహా R15కు గట్టి పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
స్పోర్ట్స్ బైక్ అభిమానులకు, ముఖ్యంగా ట్రాక్ రేసింగ్ ను ఇష్టపడే యువతకు కేటీఎం (KTM) ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. తన ఫేమస్ RC సిరీస్‌లోని అత్యంత యాక్సెసిబుల్ ధరలో లభించే RC 160 బైక్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితనం కలిగిన ఈ బైక్ ధర, ఫీచర్లు ఇప్పుడు వివరంగా చూద్దాం. KTM RC 160 ధర,లభ్యత కేటీఎం ఈ బైక్‌ను ముఖ్యంగా భారత యువ రైడర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం, దీని ధర ₹1.85 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేటీఎం డీలర్‌షిప్‌లలో RC 160 అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ప్రధాన ప్రత్యర్థి Yamaha R15.
వివరాలు
KTM RC 160 శక్తివంతమైన ఇంజిన్
కేటీఎం అంటేనే స్పీడ్. ఆ విశ్వాసాన్ని RC 160 కూడా నిలబెడుతుంది. ఇంజిన్: 164.2 cc, లిక్విడ్ కూల్డ్ (160 డ్యూక్‌లో కూడా ఇది అదే ఇంజిన్ ఉంటుంది) పవర్: 18.74 bhp @ 9,500 rpm టార్క్: 15.5 Nm @ 7,500 rpm గియర్ బాక్స్: 6-స్పీడ్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ సౌకర్యం టాప్ స్పీడ్: 118 km/h (కంపెనీ ప్రకారం) రెడ్‌లైన్: 10,200 rpm, హై-స్పీడ్ రేసింగ్ అనుభూతి కోసం కేటీఎం RC 160 డిజైన్ RC 160, పెద్ద RC బైక్‌లలా, అగ్రెసివ్ ఫ్రంట్ లుక్, పూర్తి ఫెయిరింగ్ డిజైన్‌తో వస్తుంది. రైడింగ్ పోస్టర్: ట్రాక్ రేసింగ్ బైక్‌లలా వంగి సులభంగా వేగంగా నడిపేలా ఉంటుంది.
వివరాలు
భద్రతా ఫీచర్లు,హార్డ్‌వేర్
ఎరోడైనమిక్స్: గాలిని చీల్చుతూ రైడ్ చేయడం సులభం. కేటీఎం అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించింది: బ్రేక్స్: ముందు 320 mm, వెనుక 230 mm డిస్క్ ABS: డ్యూయల్ ఛానల్ + 'సూపర్‌మోటో ABS' మోడ్ (వెనుక ఛక్రం ABS డిసేబుల్ చేసే అవకాశం) సస్పెన్షన్: ముందు 37 mm USD ఫోర్క్‌లు, వెనుక మోనోషాక్ టైర్లు: 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్ లైటింగ్: పూర్తి LED లైట్స్ డిస్ప్లే: LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్; 'TA' వేరియంట్‌లో నావిగేషన్ సౌకర్యం ఫ్యూయెల్ ట్యాంక్: 13.75 లీటర్లు
వివరాలు
నిపుణుల అభిప్రాయం:
మొదటిసారి స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే యువత, కాలేజీ కుర్రాళ్ల కోసం RC 160 ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ ధరలో కేటీఎం బ్రాండ్ వాల్యూ, రేసింగ్ ఫీచర్లు లభించడం దీనిని ప్రత్యేకం చేస్తుంది. RC 160, స్టైలిష్ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ట్రాక్ రేసింగ్ అనుభూతి, సురక్షిత సిస్టమ్‌లతో, యువ రైడర్ల కోసం ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా నిలుస్తోంది.