Lamborghini Revuelto Saudi Arabia: సౌదీ కస్టమర్ల కోసం లంబోర్గినీ బిగ్ సర్‌ప్రైజ్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌కార్ అంటే వేగం మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న డిజైన్, కథ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు లంబోర్గినీ ఇదే ఆలోచనతో సౌదీ అరేబియా కస్టమర్ల కోసం రెండు ప్రత్యేకమైన Revuelto సూపర్‌కార్లను తయారు చేసింది. ఈ రెండు కార్లను ఇటలీలోని సాంట్‌అగాటా బొలోగ్నీస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన La Prima ప్రత్యేక కార్యక్రమంలో కస్టమర్లకు అందించారు. ప్రతి కారుపై "Ad Personam KSA Edition", "1 of 2" అనే ప్రత్యేక గుర్తింపులు ఉన్నాయి. అంటే ఇవి సాధారణ లిమిటెడ్ ఎడిషన్ కార్లు కాదు.. ఒకదానికొకటి జతగా తయారైన ప్రత్యేక జంట.
Details
అరేబియా ఎడారి నుంచి డిజైన్ స్ఫూర్తి
ఈ రెండు Revuelto కార్లలో సౌదీ అరేబియా ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.
లంబోర్గినీ Ad Personam కస్టమైజేషన్ విభాగం అరేబియా ఎడారి ఇసుక దిబ్బల ఆకారాలు, రంగులను డిజైన్‌కు ఆధారంగా తీసుకుంది.
కారుపై కనిపించే గ్రాఫిక్స్ కూడా కారు బాడీపై గాలి ప్రవహించే తీరు, ఎడారి ఇసుక దిబ్బల ఆకారాన్ని గుర్తు చేసేలా రూపొందించారు.
అంటే బయట నుంచి చూస్తే ఇది సాధారణ Revueltoలా కనిపించినా, దగ్గరగా గమనిస్తే సౌదీ సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపులు కనిపిస్తాయి.
Details
ఇంటీరియర్‌లో 'లెగసీ'కి ప్రత్యేక స్థానం
కారు లోపల Nero Ade లెదర్, కార్బన్ ఫైబర్ ట్రిమ్ కలయిక కనిపిస్తుంది. సీట్లపై, ఇతర భాగాల్లో ఎడారి దిబ్బల కదలికను పోలిన ఎంబ్రాయిడరీ చేశారు.
వెనుక గోడపై ఉన్న ప్రత్యేక ప్యానెల్‌పై అరబిక్ భాషలో 'Legacy' అనే పదాన్ని స్టిచింగ్ చేశారు. రెండు వైపులా ఉన్న కార్బన్ ఫైబర్ ప్లేట్లపై కూడా KSA Edition గుర్తింపును ఇచ్చారు.
Details
V12 ఇంజిన్‌తో హైబ్రిడ్ పవర్
ఈ రెండు కార్లు స్టాండర్డ్ Revuelto ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందించారు. 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V12 ఇంజిన్‌కు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు జతగా ఉంటాయి.
మొదటి కారుకు మ్యాట్ Bianco Phanes పెయింట్, Nero Nemesis డ్యూన్ గ్రాఫిక్, Verde Speranza పిన్‌స్ట్రైపింగ్ ఇచ్చారు.
రెండో కారుకు గ్లోసీ Bianco Monocerus పెయింట్, Nero Noctis డ్యూన్ గ్రాఫిక్, మ్యాట్ Verde Rodope యాక్సెంట్స్ ఉన్నాయి.
ఇలా రెండు కార్లు ఒకే మోడల్‌కు చెందినవైనా, వాటి డిజైన్‌లో ప్రత్యేకమైన సౌదీ గుర్తింపును లంబోర్గినీ జోడించింది.