
Lamborghini Temerario : ఏప్రిల్ 30న భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్న లంబోర్గిని టెమెరారియో..920 BHP హైబ్రిడ్ పవర్‌తో..
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? భారత మార్కెట్లోకి లంబోర్గిని టెమెరారియో శక్తివంతమైన సూపర్‌కార్ రాబోతోంది.
ఈ నెల 30న లంబోర్గిని తన తాజా మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది.
ఆగస్టు 2024లో ఈ మోడల్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు వెల్లడైనప్పటికీ, ఇప్పుడు ఇది మన దేశ రోడ్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
వివరాలు
శక్తివంతమైన ఇంజిన్.. పవర్‌ట్రెయిన్
లంబోర్గిని టెమెరారియో 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో శక్తివంతంగా పనిచేస్తుంది.
ఇది 8-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉండి, 3.8 kWh బ్యాటరీతో కూడిన మూడు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో నడుస్తుంది.
ఈ పవర్‌ట్రెయిన్ సమిష్టిగా 920HP శక్తిని, 800Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడంతో పాటు, గరిష్టంగా 343 కి.మీ/గంట వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ప్రత్యేక డిజైన్ హైలైట్స్
లంబోర్గిని టెమెరారియో డిజైన్‌లో హురాకాన్ మోడల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముందువైపు షార్క్-నోస్ స్టైల్, లోయర్-లిప్ స్పాయిలర్, స్వెప్ట్-బ్యాక్ LED హెడ్‌లైట్లు అందించబడ్డాయి.
టెమెరారియో ముందువైపు హెగ్జాగోనల్ ఆకారంలో ఉన్న LED DRLs తో కూడిన ఎయిర్ ఛానెల్స్ మెరుగైన కూలింగ్‌ను అందిస్తాయి.
కొత్త అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌తో, ఇది హురాకాన్ కన్నా 20% ఎక్కువ టోర్షనల్ కాఠిన్యాన్ని అందించనుంది.
కారు మొత్తం బరువును 25 కిలోల వరకు తగ్గించేందుకు కార్బన్ ఫైబర్ ఎలిమెంట్లు ఉపయోగించబడ్డాయి.
వివరాలు
ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు
ఈ సూపర్‌కార్ లోపలి భాగంలో 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్, 9.1-అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్ లను డాష్‌బోర్డ్‌లో అమర్చారు.
లంబోర్గిని బ్రాండ్ స్పోర్టీ లుక్‌తో పాటు డ్రైవర్‌కి సౌకర్యవంతమైన అనుభూతిని కలిగించేలా డిజైన్ చేసింది.
18-వేస్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు అందించబడింది, అలాగే వేడిగాలి ఎగజిమ్మే వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఇందులో భాగంగా ఉంది.
వివరాలు
ధర & పోటీ
లంబోర్గిని టెమెరారియో భారత మార్కెట్లో సుమారు రూ.7 కోట్ల వరకు ధరకు లభించే అవకాశం ఉంది. ఇది మెక్‌లారెన్ 750S, ఫెరారీ 296 GTB వంటి హై-ఎండ్ సూపర్‌కార్లతో పోటీ పడనుంది.
భారత రోడ్లపై లంబోర్గిని టెమెరారియో తన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.
వేగం, శక్తి, డిజైన్, అధునాతన సాంకేతికతలను కలిగి ఉన్న ఈ సూపర్‌కార్ ఆటోమొబైల్ ప్రియులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం!