హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది. కేట్రా, అల్కరాజ్లకు 'అడ్వెంచర్' ఎడిషన్ ను హ్యుందాయ్ ఇటీవలే లాంచ్ చేసింది. తాజాగా హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని ఫీచర్ల గురించి తెలుసుకుందాం. వెన్యూ ఎస్యూవీలో బ్లాక్ పెయింటెడ్ గ్రిల్ వస్తోంది. ముఖ్యంగా ఈ వెహికల్ కేబిన్ లో ఆల్-బ్లాక్ థీమ్ కనిపిస్తుంది. దీంతో ఈ మోడల్ మరింత అట్రాక్టివ్గా కనిపించనుంది. అలాయ్ వీల్స్, వీల్ కవర్స్ వంటివి కూడా బ్లాక్ లోనే రానుండడం విశేషం.
హ్యుందాయ్ వెన్యూ ఎడిషన్ రూ.10లక్షలు
ఈ నూతన ఎడిషన్లో డ్యూయెల్ కెమెరా సెటప్ తో కూడిన డాష్ క్యామ్, స్పోర్టీ మెటాలిక్ ప్యాడెల్స్, సన్ రూఫ్, ఎలక్ట్రో-క్రోమిక్ ఐఆర్వీఎం వంటి ఫీచర్స్ సైతం లభించనున్నాయి. ప్రధానంగా బాస్ సౌండ్ సిస్టెమ్ ను అమర్చారు. ఈ ఎస్యూవీలో 1.2లీటర్ ఇన్ లైన్ 4 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్బాక్స్ లభిస్తోంది. వెన్యూ ఎష్ (ఓ) నైట్ ఎంటీ వర్షెన్ గా దీన్ని నామకరణం చేశారు. దీని ఎక్స్ షోరూం ధర రూ. 10లక్షలు ఉండనుంది.