LOADING...
CNG Cars: కొత్త కారు కొనాలని చూస్తారా? చౌకగా లభించే సీఎన్జీ కార్లు ఇవే!
కొత్త కారు కొనాలని చూస్తారా? చౌకగా లభించే సీఎన్జీ కార్లు ఇవే!

CNG Cars: కొత్త కారు కొనాలని చూస్తారా? చౌకగా లభించే సీఎన్జీ కార్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్‌ ధరలు భరించలేనని అనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్‌జీ వాహనాలు ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉండటంతో చాలామంది సీఎన్‌జీ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ తక్కువ ఖర్చుతో కూడుకుని, మైలేజ్ పరంగా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్‌జీ కార్లను పరిశీలిద్దాం.

Details

1. వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ 

బడ్జెట్‌ ఫ్యామిలీ కార్లలో అగ్రగామిగా నిలుస్తున్న మారుతి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ మోడల్‌ ధర రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 998 సీసీ ఇంజిన్‌తో వస్తూ 56 పీఎస్ పవర్, 92.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఇఎస్‌పీ వంటి సేఫ్టీ ఫీచర్లతో ఫ్యామిలీ యూజ్‌కు సరిగ్గా సరిపోతుంది.

Details

2. ఆల్టో కె10 సీఎన్‌జీ 

తక్కువ ధరలో లభించే మరో ప్రాచుర్యం పొందిన కారు ఆల్టో కె10. దీని సీఎన్‌జీ మోడల్‌ ధర రూ. 4.82 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వ్యాగన్ ఆర్‌లోని 998 సీసీ ఇంజిన్‌నే ఇందులో కూడా ఉపయోగించారు. ఇది 56 పీఎస్ పవర్‌, 82.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కిలోకు 33.85 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి

Details

3. మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ

మినీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ మోడల్‌ ధర రూ. 4.62 లక్షల నుంచి మొదలవుతుంది. 1.0 లీటర్‌ మారుతి K సిరీస్‌ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 56 పీఎస్ పవర్‌, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ ఇస్తుంది. కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుంది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, రియర్ పార్కింగ్‌ సెన్సార్లతో వస్తుంది.

Details

4. మారుతి సెలెరియో సీఎన్‌జీ

బడ్జెట్‌లోనే ప్రీమియం లుక్‌ కోరుకునే వారికి మారుతి సెలెరియో ఉత్తమ ఎంపిక. దీని సీఎన్‌జీ వేరియంట్‌ ధర రూ. 5.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998 సీసీ ఇంజిన్‌తో 56 పీఎస్ పవర్‌, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ ఇస్తుంది. కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Details

5. టాటా టియాగో సీఎన్‌జీ 

టాటా నుంచి లభించే ఈ బడ్జెట్‌ మోడల్‌ ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్‌ ఇంజిన్‌తో 72 పీఎస్ పవర్‌, 95 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కిలోకు 28.06 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. 4 స్టార్ గ్లోబల్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఈ కారు భద్రత, పనితీరు పరంగా విశ్వసనీయమైనది. మొత్తం మీద, తక్కువ ఖర్చుతో మైలేజ్‌ ఎక్కువగా ఉండే కారును కోరుకునే వారికి సీఎన్‌జీ వాహనాలు ప్రస్తుతం మార్కెట్లో ఉత్తమ ఎంపికగా మారాయి.