LOADING...
Tata Sierra : బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు.. 3 కొత్త ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ?
బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు.. 3 కొత్త ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ?

Tata Sierra : బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు.. 3 కొత్త ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, కంపెనీలు తమ బేస్ వేరియంట్లలోనే లగ్జరీ, టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ బేస్ వేరియంట్లు మంచి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. మరి ఈ మూడు ఎస్‌యూవీల్లో నిజంగా వాల్యూ ఫర్ మనీ ఏది? వివరంగా చూద్దాం.

Details

 టాటా సియెర్రా బేస్ వేరియంట్

టాటా సియెర్రా ఎస్‌యూవీ గత నవంబర్‌లో మార్కెట్‌లోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ పేరు 'స్మార్ట్+'. పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 11.49లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ స్టోరేజ్‌తో ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ లైట్ సేబర్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, టెయిల్ ల్యాంప్స్ అన్ని పవర్ విండోలు బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ టర్న్ ఇండికేటర్లతో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్ 10.16 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు ప్రకాశవంతమైన లోగోతో టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ రియర్ ఏసీ వెంట్స్ టైప్-A + టైప్-C 45W యూఎస్‌బీ పోర్టులు

Details

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ బేస్ వేరియంట్..

మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌గా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓను విడుదల చేసింది. ఇందులో 'ఏఎక్స్' బేస్ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ధరలు (ఎక్స్-షోరూమ్) పెట్రోల్: రూ. 13.66 లక్షలు డీజిల్: రూ. 14.96 లక్షలు

Advertisement

Details

ఈ వేరియంట్‌లోని ఫీచర్లు..

క్లియర్ లెన్స్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ పియానో బ్లాక్ క్లాడింగ్ ఫుల్ సైజ్డ్ వీల్ కవర్‌తో R17 స్టీల్ వీల్స్ కోస్ట్ టు కోస్ట్ ట్రిపుల్ 12.5 ఇంచ్ హెచ్‌డీ స్క్రీన్స్ 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇంటెలిజెంట్ అడ్రినోక్స్ సిస్టమ్స్మా ర్ట్‌వాచ్ కనెక్టివిటీ అలెక్సా బిల్ట్-ఇన్, చాట్‌జీపీటీ సపోర్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫ్రంట్ టైప్-C 65W, 15W టైప్-A యూఎస్‌బీ రియర్ టైప్-C 65W యూఎస్‌బీ థర్డ్ రో 12V ఛార్జింగ్ పోర్ట్ క్రూయిజ్ కంట్రోల్ బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ విత్ డీఆర్‌ఎల్ థర్డ్ రో ఏసీ వెంట్స్ డ్రైవ్ మోడ్స్ - జిప్, జ్యాప్, జ్యూమ్ (డీజిల్‌లో అదనపు ఆప్షన్లు) ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు

Advertisement

Details

అదనపు ఫీచర్లు ఇవే

షార్క్ ఫిన్ యాంటెనా స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ 2వ, 3వ రోలకు రియర్ ఏసీ వెంట్స్ రూఫ్ రైల్స్, రియర్ స్పాయిలర్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ పుష్ బటన్ స్టార్ట్ కో-డ్రైవర్ సన్‌విజర్ విత్ మిర్రర్ కప్ హోల్డర్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ 6-వే మాన్యువల్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ & కో-డ్రైవర్ సీట్ బెల్ట్స్ నాలుగు పవర్ విండోలు డ్రైవర్ డోర్ వన్-టచ్ డౌన్ పవర్ విండో

Details

2026 కియా సెల్టోస్ బేస్ వేరియంట్

ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన 2026 కియా సెల్టోస్ స్టైలిష్ లుక్, సరసమైన ధరలతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని బేస్ వేరియంట్ పేరు 'హెచ్‌టీఈ'. ధరలు (ఎక్స్-షోరూమ్) పెట్రోల్ మాన్యువల్: రూ. 10.99 లక్షలు డీజిల్ మాన్యువల్: రూ. 12.59 లక్షలు ఈ వేరియంట్‌లో లభించే ఫీచర్లు.. 12 ఇంచ్ ఎల్‌సీడీ క్లస్టర్, 4.2 ఇంచ్ కలర్ టీఎఫ్‌టీ ఎంఐడ 10.25 ఇంచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో క్రూయిజ్ కంట్రోల్ మాన్యువల్ ఏసీతో రియర్ ఏసీ వెంట్స్ ఎలక్ట్రిక్ ఓఆర్‌వీఎంలు మీడియా కంట్రోల్స్‌తో డీ-కట్ స్టీరింగ్ వీల్ మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ స్పీకర్లు

Details

ఏది ఎంచుకుంటే బెటర్? 

వాల్యూ ఫర్ మనీ పరంగా చూస్తే కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ బేస్ వేరియంట్లు ముందంజలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు మోడళ్లలోనూ బేస్ వేరియంట్ నుంచే టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, స్పీకర్లు, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి రోజువారీ అవసరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక టాటా సియెర్రా విషయానికి వస్తే, భద్రతా పరంగా, యాంత్రికంగా (ఆల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్ వంటి అంశాలు) బలంగా ఉన్నప్పటికీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ల కోసం పై వేరియంట్లను ఎంచుకోవాల్సి వస్తుంది. అందువల్ల లగ్జరీ, టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తే మహీంద్రా వైపు, బడ్జెట్‌తో పాటు స్టైల్ కోరుకుంటే కియా సెల్టోస్ వైపు చూడవచ్చని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement