Mahindra be 07: లగ్జరీ లుక్, భారీ రేంజ్.. 600 కి.మీ రేంజ్‌తో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎక్స్‌ఈవీ 9ఈ, ఎక్స్‌ఈవీ 9ఎస్, బీఈ 6 మోడళ్లతో ఎలక్ట్రిక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన కంపెనీ.. ఇప్పుడు 'బీఈ 07' కాన్సెప్ట్ ఆధారంగా నాలుగో బోర్న్-ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పోర్టీ లుక్‌తో వచ్చిన బీఈ 6 యువతను ఆకట్టుకుంటుండగా, కొత్త బీఈ 07 మాత్రం మరింత ప్రీమియం, విశాలమైన మరియు లగ్జరీ ఫీల్‌తో ఉండబోతోందని సమాచారం.
వివరాలు
రేంజ్ రోవర్ స్టైల్‌లో డిజైన్
మహీంద్రా బీఈ 07 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బాక్సీ షేప్‌తో, నిటారుగా ఉండే బలమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంది. దీని స్టైలింగ్ లగ్జరీ రేంజ్ రోవర్ వాహనాలను గుర్తుకు తెచ్చేలా ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఈ కారులో వెర్టికల్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫ్లాట్ రూఫ్‌లైన్, వెనుక భాగంలో క్లీన్ ప్రొఫైల్ వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదనంగా గాలి ఒత్తిడిని తగ్గించేలా రూపొందించిన 19-ఇంచ్ ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొస్తున్నాయి.
వివరాలు
విశాలమైన ఇంటీరియర్
బీఈ 6 మాదిరిగానే 2775 ఎంఎం వీల్‌బేస్ ఉన్నప్పటికీ, బీఈ 07 మరింత పొడవుగా మరియు ఎత్తుగా ఉండబోతోంది. దీని వల్ల ప్రయాణికులకు ఎక్కువ హెడ్‌రూమ్, అలాగే పెద్ద బూట్ స్పేస్ లభించే అవకాశం ఉంది. 600 కి.మీ వరకు రేంజ్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మహీంద్రా అభివృద్ధి చేసిన అత్యాధునిక INGLO మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఇది హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. బీఈ 07 రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. అవి 59 kWh మరియు 79 kWh. ప్రత్యేకంగా 79 kWh వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
వివరాలు
ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్
రియల్ వరల్డ్ డ్రైవింగ్‌లో కూడా సుమారు 500 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ కార్ ఇంటీరియర్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడుతోంది. ఇందులో మహీంద్రా తొలిసారిగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను అందిస్తోంది. డ్రైవర్ కోసం 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే మధ్యలో 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ముందు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3-ఇంచ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఇవే కాకుండా 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, భారీ పనోరమిక్ సన్‌రూఫ్, టచ్-సెన్సిటివ్ హ్యాప్టిక్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
వివరాలు
లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
మహీంద్రా బీఈ 07 ప్రొడక్షన్ వెర్షన్‌ను 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. అధికారిక విక్రయాలు మాత్రం 2027లో ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. భారత మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఇది టాటా హారియర్ ఈవీ, బీవైడీ అట్టో 3, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.