
Nissan: నిస్సాన్ నుంచి లగ్జరీ మినీవ్యాన్.. లాంచ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ దిగ్గజ ఆటో మేకర్ నిస్సాన్ నుంచి మరో అసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
నిస్సాన్ హైపర్ టూరర్ కన్సెప్ట్‌తో అత్యాధునిక లగ్జరీ మినీవ్యాన్‌ను ఆవిష్కరించనుంది.
త్వరలో టోక్సోలో జరిగే మోటర్ షోలో దీన్ని ఆ సంస్థ ప్రదర్శించనుంది.
గతంలో ప్రకటించిన హైపర్ అడ్వెంచర్, హైపర్ అర్బన్ మోడల్లో ఇది రానుంది. దీన్ని వోల్వో EM90కి పోటీగా రూపొందించారు. ఈ కొత్త మినీవాన్ అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
ఇందులో ఏరో-ఆప్టిమైజ్డ్ డిజైన్, డైనమిక్ బాడీ ప్యానెల్ లు ఉన్నాయని నిస్సాన్ వెల్లడించింది.
Details
సూపర్ టెక్నాలజీతో మినీ వ్యాన్
డిజైన్‌లో స్ట్రీమ్‌లైన్డ్ ఎయిర్‌ఫ్లో కోసం ఛానెల్‌లు, డ్రాగ్-రిడ్యూసింగ్ వీల్స్, డోర్ మిర్రర్‌లు లేవు.
అయితే ముందు భాగం DRLగా మారనుంది. లోపల అధునాతన టెక్నాలజీ కారణంగా సుదూర ప్రయాణానికి ఈ వెహికల్ అనువుగా ఉండనుంది.
అధిక-సాంద్రత కలిగిన బ్యాటరీలు అంతర్గత స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని నిర్ధారించడానికి ఇందులో ప్రత్యేక సాంకేతికను జోడించారు.
హైపర్ టూరర్ వాహనం అటానమస్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్రయాణీకులకు సౌకర్యంగా 360 డిగ్రీస్ సీట్లను అమర్చారు.
ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన హృదయ స్పందన రేటు, శ్వాస, చెమట వంటి వివిధ అంశాలను AI సాంకేతికత పర్యవేక్షిస్తుందని నిస్సాన్ పేర్కొంది.