
స్కార్పియో ఎన్ మోడల్ ధరను మళ్లీ పెంచేసిన మహీంద్రా
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా గత నాలుగు నెలల్లో మహాంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ధరను రెండోసారి పెంచింది.
మహీంద్రా గత జనవరిలో స్పార్పియో-మోడల్ మొదటి ధరను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు మహీంద్రా తన ధరను కనిష్టంగా రూ.15,000 నుంచి గరిష్టంగా 1.01 లక్షలకు పెంచింది.
ఇప్పుడు ఏకంగా స్పారియో-ఎన్ మోడల్ కారు ధరను మహీంద్రా రూ.51,229 వరకూ పెంచింది. Z2, Z4, Z6, Z8, Z8L అనే ఐదు వెరియంట్ లతో స్కారియో-ఎన్ మోడల్‌ను గత ఏడాది జూలైలో ఇండియాలోనే ప్రవేశపెట్టారు.
మహీంద్రా
స్కార్పియో-ఎన్ మోడల్ ధర వివరాలు
గతేడాది లాంచ్ చేసిన సమయంలో స్కార్పియో-ఎన్ ఎంట్రీ లెవల్ మోడల్ ధర ఎక్స్ షోరూం ప్రకారం రూ.11.99 లక్షలు ఉంది.
ప్రస్తుతం దీని ఎంట్రీ లెవల్ పెట్రోల్ వెరియంట్ రూ.13.06 లక్షలు ఎక్స్ షోరూం, ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ రూ.13.56 లక్షలు ఎక్స్ షోరూం వద్ద అందుబాటులో ఉన్నాయి.
స్పార్పియో ఎన్ టాప్-ఎండ్ Z8L, 4 వీల్ డ్రైవ్, 7 సీటర్ వేరియంట్ ధర రూ.24.51 లక్షలు ఉండనుంది.
మహీంద్రా స్పార్పియో ఎన్ ఎంట్రీ లెవల్ వేరియంట్‌లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా లక్షణాలతో ప్రారంభించడం గమనార్హం.