
Mahindra: అదనపు ఫీచర్లు, తగ్గిన ధరలతో కొత్త బొలెరో శ్రేణిని విడుదల చేసిన మహీంద్రా
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా తన పాపులర్ SUV లలో బొలేరో, బొలేరో నీయో మోడళ్లను నవీకరించి కొత్త శ్రేణిని ప్రకటించింది. 2025 మోడళ్లకు రిఫ్రెష్ చేసిన డిజైన్, కొత్త ఫీచర్లు, మెరుగైన వేరియంట్లు కల్పించారు. సాంప్రదాయ బొలేరో ఇప్పుడు ₹7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది, బొలేరో నీయో ₹8.49 లక్ష (ex-showroom) నుంచి ప్రారంభం అవుతుంది. రెండు మోడళ్లలోనూ కొత్త టాప్ వేరియంట్లు వచ్చాయి. దీంతో బొలేరోకి క్లాసిక్ లుక్‌తో పాటు కొత్త మోడరన్ టచ్ కూడా వచ్చింది.
వేరియంట్ వివరాలు
మూడు వేరియంట్లలో బొలేరో
2025 కోసం బొలేరో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: B4, B6, B8. ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ ₹7.99 లక్ష నుండి ప్రారంభమవుతుంది, ఇది పూర్వపు ₹8.79 లక్షలకంటే తగ్గింది. మిడ్-స్పెక్ B6 ₹8.69 లక్ష, కొత్త టాప్-ఎండ్ B8 ₹9.69 లక్షలో లభిస్తుంది. ఈ ధర విధానం మొదటిసారి SUV కొనుగోలు చేసే వారికి బొలేరోను మరింత అందుబాటులోకి తీసుకురావడం సహాయపడుతుంది, ప్రతి ట్రిమ్ స్థాయిలో ఎక్కువ విలువను అందిస్తుంది.
ఫీచర్ అప్‌గ్రేడ్‌లు
ప్రధాన నవీకరణలు ఏమిటి?
B4 వేరియంట్ వినైల్ సీట్స్,సాధారణ ఇంటీరియర్‌తో ప్రాధాన్యతను ఇస్తుంది. B6 వేరియంట్‌లో ఫాబ్రిక్ అప్‌హోల్స్టరీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కల్పించబడింది. కొత్త టాప్-ఎండ్ B8 వేరియంట్‌లో లెదరెట్ సీట్స్, డైమండ్-కట్ అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు స్టాటిక్ బెన్డింగ్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి బొలేరో రూపాన్ని మెరుగుపరచడంతో పాటు రోజువారీ ఉపయోగంలో సౌకర్యాన్ని పెంచుతాయి
భద్రతా నవీకరణలు
కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
మొదటిసారిగా బొలేరోలో 17.8 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు స్టీరింగ్‌పై నుంచి నియంత్రించగల కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (DIS) ద్వారా వాహన సమాచారం,USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. అన్ని వేరియంట్లలో కొత్త గ్రిల్ డిజైన్ మరియు 'స్టెల్త్ బ్లాక్' కలర్ ఆప్షన్ జోడించబడింది, ఇది బొలేరోకు ప్రీమియం లుక్ ఇస్తుంది.
డిజైన్ మెరుగుదలలు
బొలేరో నీయోకు కూడా కొత్త ఫ్రంట్ గ్రిల్
నగర, అర్ధ-నగర ప్రాంత వినియోగదారుల కోసం బొలేరో నీయోకు కూడా 2025లో పెద్ద అప్డేట్ వచ్చింది. కొత్త హారిజాంటల్ అక్సెంట్స్ కలిగిన ఫ్రంట్ గ్రిల్ మరియు 16-అంగుళాల అలాయ్ వీల్స్ జోడించబడ్డాయి. బాక్సీ షేప్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ అలాగే ఉంది, బొలేరో ప్రత్యేకతను నిలుపుతుంది. కొత్త ఎక్స్‌టీరియర్ కలర్‌లు: జీన్స్ బ్లూ,కాన్‌క్రీట్ గ్రే అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు
పవర్, ఇన్ఫోటైన్‌మెంట్
బొలేరో నీయోకు 22.8 సెం.మీ. (9-అంగుళాల) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్, రిఫ్రెష్ చేసిన మెటీరియల్స్, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 1.5-లీటర్ mHawk100 డీజిల్ ఇంజిన్ (100హెచ్‌పీ, 260Nm టార్క్) మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కొనసాగుతున్నాయి.