మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ SUV విడుదలకు ఆగస్ట్ 15న ముహుర్తం
భారత ఆటోమోబైల్ రంగంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే SUV EV థార్ వాహనాన్ని మార్కెట్లోని తీసుకురానుంది. ఈ మేరకు ఆగస్టు 15న 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా థార్ ఎలక్టిక్ వాహనాన్ని లాంచ్ చేయనుంది. ఈ మేరకు మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం మహీంద్రా గ్లోబల్ ఈవెంట్ చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఆగస్టు 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా థార్ మెగా లాంచ్ జరగనుంది. అదే వేదికగా కొత్తగా తీసుకురానున్న ప్యాసింజర్ వాహనాలతో పాటు వాణిజ్య వాహనాల శ్రేణిని ప్రదర్శనకు నిలపాలని మహీంద్రా ఆటోమోబైల్ భావిస్తోంది.
అధునాతనమైన ఫీచర్స్ సొంతం చేసుకున్న థార్ SUV EV వాహనం
ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రయాణం తదుపరి దశ రానున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా ఫ్యూచర్ స్కేప్‌లో ఆవిష్కరించనున్నట్లు ట్విట్టర్ ద్వారా సంస్థ పేర్కొంది. ఇది మా గో గ్లోబల్ విజన్ ఆటో & ఫార్మ్ షోకేస్ అని రాసుకొచ్చింది. మహీంద్రా థార్ EV కాన్సెప్ట్ అనేక అధునాతన ఫీచర్లను అందించగలదని ఆటో మార్కెట్లో జోరుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నత్త నడక లేదా క్రాబ్ స్టీర్ సామర్ధ్యం గురించి చర్చించుకుంటున్నారు. ఈ వాహనంలోని నాలుగు చక్రాలను 45° కోణంలో తిప్పేందుకు వీలుంది.ఆఫ్ రోడింగ్ లో ఇలాంటి సామర్థ్యాలు కలిగిన వాహనాలు చాలా ఉపయోగకరం. ఇరుకు ప్రదేశాల్లోనూ పార్క్ చేసేలా డిజైన్ చేశారు. వాహనాన్ని 360 డిగ్రీల్లోనూ మలుపు తిప్పగలగడం థార్ ప్రత్యేకతగా నిలుస్తోంది,