Page Loader
Top 5 Cars: ఆగస్టులో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాప్ 5 కార్లు ఇవే!
ఆగస్టు నెలలో విడుదల కానున్న వోల్వో సీ40 రీచార్జ్‌

Top 5 Cars: ఆగస్టులో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాప్ 5 కార్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు నెలలో అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్స్‌లో కార్లు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. జులై నెలలో కూడా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వెహికల్స్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడి చేశాయి. మార్కెట్లో తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి క్రేజీ ఫీచర్లతో ఆగస్టులో కొన్ని కంపెనీలు తమ మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. అవెంటో తెలుసుకుందాం.. ఐ-సీఎన్‌జీ టెక్నాలజీతో వస్తున్న టాటా పంచ్ సీఎస్‌జీ 2023 జనవరిలో ఆటో ఎక్స్‌పోలో పంచ్ సీఎన్‌జీ మోడల్‌ను టాటా మోటర్స్ ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీ ఆగస్ట్ మొదటి వారంలో లాంచ్ కానుంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్‌తో ముందుకొచ్చింది. 77 హెచ్‌పీ పవర్‌ను, 97 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది.

Details

ఆగస్టు 9న సెకెండ్ జెన్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ లాంచ్

ఆడీ క్యూ8 ఈ-ట్రాస్ ఈవీలో రెండు బ్యాటరీలు ఆగస్టులో ఆడీక్యూ 8 ఈ-ట్రాన్ వంటి లగ్జరీ కారు రానుంది. ఆడీ ఈ-ట్రాన్‌కు ఇది ఫేస్ లిఫ్ట్ వర్షెన్. ఈ ఈవీలో 95కేడబ్ల్యూహెచ్​, 114కేడబ్ల్యూ హెచ్​ వంటి రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. సెకెండ్​ జెన్​ మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ గతేడాది లాంచ్ అయ్యింది. ఇక ఇండియాలో ఆగస్ట్ 9న ఇది లాంచ్ కానుంది. జీఎల్ సీ 300 పెట్రోల్, జీఎల్‌సీ 220 డీ డీజల్ మోడల్స్‌లో వస్తోంది. 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 11.9 ఇంచ్ పోట్రైట్ ఓరియెంటెండ్ టచ్ స్క్రీన్‌తో ప్రత్యేకంగా రూపొందించారు.

Details

సెప్టెంబర్ లో వోల్వో సీ20 రీచార్జ్ డెలవరీలు

వోల్వో సీ40 రీచార్జ్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్లు ఇండియాలో ఈ వోల్వోకు ఇది రెండో ఈవీగా రానుంది. సెప్టెంబర్‌లో డెలవరీలు ప్రారంభం కానున్నాయి. 78కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సరికొత్త ఫీచర్స్‌తో క్రేటా, అల్కజార్ క్రేటా, అల్కజార్ హ్యందాయ్ మోటర్స్ కు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గా ఉన్నాయి. ప్రస్తుతం అడ్వెంచర్ ఎడిషన్స్ ను సంస్థ తీసుకోస్తున్నట్లు సమాచారం. వీటి లాంచ్ డేట్ పై ఇంకా ప్రటకన వెలువడలేదు.