
మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా సంస్థ ఇటీవల భారతదేశంలో Thar RWDని విడుదల చేసింది. SUV పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో మూడు విభిన్న వేరియంట్లలో రాబోతుంది. Thar RWD డీజిల్ బుక్ చేస్తే మాత్రం డెలివరీకి సమయం పడుతుంది.
మహీంద్రా Thar RWD mStallion 150 TGDI పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేకుండా థార్ RWDలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఒక కొత్త D117 CRDe డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మహీంద్రా Thar RWD హార్డ్ టాప్‌తో మాత్రమే అందించబడుతోంది.
కార్
జనవరి 2023లో ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 65.5% వృద్ధిని నమోదు చేసింది
వేరియంట్ వారీగా మహీంద్రా థార్ RWD ధరలు (ఎక్స్-షోరూమ్) AX(O) RWD డీజిల్ MT ధరరూ. 9.99 లక్షలు, LX RWD - డీజిల్ MT ధర రూ. 10.99 లక్షలు, LX RWD - పెట్రోల్ ATధర రూ. 13.49 లక్షలు, మహీంద్రా థార్ RWD డెలివరికి మహీంద్రా థార్ RWD పెట్రోల్ ఇంజిన్ అయితే 3-5 వారాలు పడుతుంది, మహీంద్రా థార్ RWD డీజిల్ఇంజిన్ అయితే 72-74 వారాలు పడుతుంది.
మహీంద్రా జనవరి 2022లో 19,964 కార్ల అమ్మకాల నుండి జనవరి 2023లో ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 65.5% వృద్ధిని నమోదు చేసి 33,040 అమ్మకాలకు చేరుకుంది. ఏప్రిల్-జనవరి 2023 ఆర్ధిక సంవత్సరంలో 71.7% పెరిగి 292,898 యూనిట్లకు పెరిగింది.