Loading...
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S సేఫ్టీలో అదుర్స్‌.. క్రాష్‌ టెస్టుల్లో 5 స్టార్‌ రేటింగ్
మహీంద్రా XEV 9S సేఫ్టీలో అదుర్స్‌.. క్రాష్‌ టెస్టుల్లో 5 స్టార్‌ రేటింగ్

Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S సేఫ్టీలో అదుర్స్‌.. క్రాష్‌ టెస్టుల్లో 5 స్టార్‌ రేటింగ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

BNCAP పరీక్షల్లో మహీంద్రా XEV 9S పెద్దల భద్రతలో 32 పాయింట్లకు 31.15 స్కోర్‌ సాధించింది. పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు 45 పాయింట్లు దక్కించుకుంది. దీంతో రెండు విభాగాల్లోనూ ఐదు స్టార్‌ రేటింగ్‌ సొంతమైంది. ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ క్రాష్‌ పరీక్షలో డ్రైవర్‌ తల, మెడ, ఛాతీ, కాళ్లకు మంచి రక్షణ లభించింది. కో-డ్రైవర్‌ ఛాతీకి మాత్రం సరిపడా రక్షణ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు.

Details

సైడ్‌ ఇంపాక్ట్‌ పరీక్షలోనూ మంచి ఫలితాలు

పక్క నుంచి మరో వాహనం ఢీకొన్నప్పుడు లేదా రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని కారు ఢీకొన్నప్పుడు ప్రయాణికులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండు పరిస్థితులను పరీక్షించే సైడ్‌ మూవబుల్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌, సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ టెస్టుల్లోనూ XEV 9S మంచి రక్షణ చూపించింది.

అన్ని ప్రధాన శరీర భాగాలకు 'గుడ్‌' ప్రొటెక్షన్‌ లభించింది. పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఏడు సీట్ల SUVలో ఈ ఫలితాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Details

భద్రత కోసం ఆధునిక ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్‌ SUVలో మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ABS విత్‌ EBD, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ వ్యూ, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పై వేరియంట్లలో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ వంటి ADAS సదుపాయాలు కూడా లభిస్తాయి.

ADVERTISEMENT

Details

679 కిలోమీటర్ల వరకు రేంజ్

మహీంద్రా XEV 9Sలో 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ARAI ధ్రువీకరించిన రేంజ్‌ 521 నుంచి 679 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

140kW నుంచి 180kW వరకు DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. ఈ SUV ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.20.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

భద్రత, స్థలం, రేంజ్‌.. ఈ మూడు అంశాలను ఒకే వాహనంలో కోరుకునే వారికి XEV 9S మరో ఎంపికగా నిలుస్తోంది.

ADVERTISEMENT