LOADING...
Maruti Suzuki Ignis : ఇగ్నిస్‌ను పక్కన పెట్టిన మారుతీ.. కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌పై ఫోకస్
ఇగ్నిస్‌ను పక్కన పెట్టిన మారుతీ.. కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌పై ఫోకస్

Maruti Suzuki Ignis : ఇగ్నిస్‌ను పక్కన పెట్టిన మారుతీ.. కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌పై ఫోకస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ నుంచి వచ్చిన విభిన్నమైన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించే దశకు చేరుకున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కార్ ఉత్పత్తిని మౌనంగా నిలిపివేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం నెక్సా డీలర్‌షిప్‌ల వద్ద ఉన్న స్టాక్ పూర్తయిన వెంటనే ఇగ్నిస్ అధికారికంగా మార్కెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు వెనకబడింది? 2017 జనవరిలో లాంచ్ అయిన ఇగ్నిస్ 'అర్బన్ ఎస్‌యూవీ' కాన్సెప్ట్‌తో యువతను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే దీని వెనుక భాగం డిజైన్ భారతీయ వినియోగదారులను పెద్దగా మెప్పించలేకపోయింది.

వివరాలు

అమ్మకాల పరంగా వెనుకబడింది

అమ్మకాల పరంగా కూడా ఈ కారు పోటీ ఇవ్వలేకపోయింది. 2022లో ఇగ్నిస్ సుమారు 51,176 యూనిట్లు అమ్ముడైతే, అదే సమయంలో దాదాపు సమాన ధరలో ఉన్న మారుతీ సుజుకీ సిఫ్ట్ మాత్రం 1,76,424 యూనిట్లతో భారీ విజయాన్ని సాధించింది. నవీకరణల లోపం గత 9 సంవత్సరాల్లో ఇగ్నిస్‌కు పెద్దగా అప్‌డేట్లు రాలేదు. 2020లో ఒక ఫేస్‌లిఫ్ట్ ఇచ్చిన తర్వాత మరే పెద్ద మార్పులు చేయలేదు. ఇతర మారుతీ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు చేరుతున్నప్పటికీ, ఇగ్నిస్ మాత్రం కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లకే పరిమితమైంది. ఇదే పరిస్థితి మారుతి సుజుకి సియాజ్‌కు కూడా ఉండటం గమనార్హం.

వివరాలు

సీఎన్జీ ఆప్షన్ లేకపోవడం

భారత మార్కెట్లో మైలేజీకి ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో, మారుతీ తన ఇతర మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు అందిస్తోంది. కానీ ఇగ్నిస్‌కు ఈ ఆప్షన్ ఇవ్వకపోవడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. డీజిల్ వేరియంట్ ముందే నిలిపివేత ప్రారంభంలో 1.2 లీటర్ పెట్రోల్‌తో పాటు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చిన ఇగ్నిస్‌లో, డీజిల్ వేరియంట్‌ను 2018లోనే డిమాండ్ లేక తొలగించారు.

Advertisement

వివరాలు

అమ్మకాలు పడిపోవడం

ఇటీవలి నెలల్లో ఈ కార్ అమ్మకాలు 2000 యూనిట్ల కంటే తక్కువకు పడిపోవడంతో, చివరికి ఈ మోడల్‌ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ.5.35 లక్షల నుంచి రూ.7.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అధికారిక ప్రకటన పెండింగ్ ఇగ్నిస్ డిస్కంటిన్యూ విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొత్త మోడల్ రానుందా? ఇగ్నిస్ పేరును మళ్లీ ఉపయోగించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే దీని స్థానాన్ని భర్తీ చేయడానికి 'వై43' కోడ్‌నేమ్‌తో కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ సిద్ధం చేస్తోంది. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి మోడళ్లకు పోటీగా మార్కెట్‌లోకి రానుంది.

Advertisement