అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్
మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది. భారతదేశంలో మారుతి సుజుకికి అత్యధికంగా అమ్ముడయ్యే కారు Alto. 2000లో వచ్చినప్పటి నుండి 43 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఈ సంస్థ గత సంవత్సరం K10 వేరియంట్‌ను DualJet K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉండేలా ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది.
Alto K10 ఎక్స్ట్రా ఎడిషన్ ధర, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
మారుతి సుజుకి Alto K10 ఎక్స్‌ట్రా ఎడిషన్ "టాల్-బాయ్" స్టాన్‌తో, మస్కులర్ బానెట్, ఆరెంజ్ హైలైట్‌లతో బ్లాక్డ్-అవుట్ స్కిడ్ ప్లేట్లు ఉంటాయి. లోపల మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, పవర్ విండోస్, మాన్యువల్ AC, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ను ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం రెండుఎయిర్‌బ్యాగ్‌లు, ABS ఫంక్షన్ ఇందులో ఉంటాయి. మారుతి సుజుకి Alto K10 ఎక్స్‌ట్రా ఎడిషన్ ధర, ఇతర వివరాలను వాహన తయారీ సంస్థ త్వరలో వెల్లడిస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ధర అంటే సుమారు రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చు.