LOADING...
Maruti Suzuki Dzire : డిజైర్ కొనాలనుకుంటున్నారా? ధర నుంచి మైలేజీ వరకు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివే!
డిజైర్ కొనాలనుకుంటున్నారా? ధర నుంచి మైలేజీ వరకు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివే!

Maruti Suzuki Dzire : డిజైర్ కొనాలనుకుంటున్నారా? ధర నుంచి మైలేజీ వరకు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో సెడాన్ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజీ కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఫేవరెట్ ఎంపికగా నిలిచింది. అందుకే 2025లో దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే తాజా మోడల్ పాత వర్షన్‌తో పోలిస్తే పూర్తిగా మారిపోయి మరింత ఆధునికంగా తయారైంది. ఈ కారును కొనాలనుకుంటే గమనించాల్సిన 5 ముఖ్య విషయాలు ఇవి.

వివరాలు

1. ధర, వేరియంట్లు

కొత్త జనరేషన్ డిజైర్ ధర రూ. 6.25 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 9.31 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ (LXi)లో కేవలం పెట్రోల్-మాన్యువల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అయితే VXi, ZXi వేరియంట్లలో AMT, CNG ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. 2. సరికొత్త డిజైన్ నవంబర్ 2024లో లాంచ్ అయిన ఈ కొత్త డిజైర్, పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా మారింది. ఎక్స్‌టీరియర్ డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. క్యాబిన్‌లో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కూడా రీడిజైన్ చేసి, ఆధునిక స్టైల్‌ను అందించారు.

వివరాలు

3. కొత్త ఇంజిన్, అద్భుత మైలేజీ

ఈ కారులో 1.2 లీటర్, త్రీ-సిలిండర్ 'Z-Series' పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 80 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్: లీటరుకు 24.79 కి.మీ AMT వేరియంట్: 25.71 కి.మీ CNG వేరియంట్: కిలో గ్యాస్‌కు 33.73 కి.మీ మైలేజీ 4. ఫీచర్లు టెక్నాలజీ పరంగా ఈసారి కంపెనీ రాజీ పడలేదు. 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, డిజైర్ చరిత్రలో తొలిసారిగా టాప్ వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నారు. అదనంగా వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, యూఎస్‌బీ పోర్టులు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

Advertisement

వివరాలు

5. సేఫ్టీ - 5 స్టార్ రేటింగ్

ఈ కొత్త డిజైర్‌తో మారుతీ సుజుకీ సేఫ్టీపై ఉన్న అపోహలను చెరిపేసింది. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టుల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి మోడళ్లకు ఈ కొత్త డిజైర్ గట్టి పోటీ ఇస్తోంది.

Advertisement