మారుతీ సుజకీ ఫ్రాంక్స్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
మారుతీ సుజికీ ఫ్రాంక్స్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటో మొబైల్ ప్రియులు ఈ బైక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు మారుతీ సుజకీ ఫ్రాంక్స్ ను లాంచ్ చేశారు. జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్పోలో ఈ ఎస్యూవీని దిగ్గజ సంస్థ అయిన మారుతీ సుజుకీ ప్రదర్శించింది. ఈ కారుకు భారతదేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్యూవీ పోర్ట్ ఫోలియోను పెంచుకొనే పనిలో నిమగ్నమైంది. ఈ మోడల్ కోసం అదిరిపోయే బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మారుతీ సుజకీ ఫ్రాంక్స్ ను నెక్సా రీటైల్ చైనా ద్వారా విక్రయిస్తోంది. అయితే ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న బెజ్రాకు ఇది ప్రత్యామ్నాయంగా మారనుంది.
కారు ధర, వివరాలు
మొత్తం మీద ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ను రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో పాటు పలు వేరియంట్లలో విక్రయిస్తోంది. ప్రాంక్స్ పొడవు 3,995 ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం. ఎత్తు 1,550ఎంఎం. వీల్బేస్ వచ్చేసి 2,520ఎంఎం ఉంటుంది. ఇందులో హెడ్ అప్ డిస్ ప్లే యూనిట్, 4 స్పికర్స్-2 ట్విటర సెటప్, వయర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, ఇంజిన్ స్టార్ట్-స్మార్ట్ బటన్, క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ తో ఫ్రాంక్స్ రానుంది. సిగ్మా 5ఎంటీ:- రూ. 7,46,500, డెల్టా 5ఎంటీ:- రూ. 8,32,500, డెల్టా+ 5ఎంటీ:- రూ. 8,72,500, డెల్టా+ ఏజీఎస్:- రూ. 9,27,500లగా ఉన్నాయి.