Loading...
Maruti Suzuki: వాహన సర్వీస్ ఖర్చులకు చెక్.. మారుతీ సుజుకి 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్' ప్రారంభం
మారుతీ సుజుకి 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్' ప్రారంభం

Maruti Suzuki: వాహన సర్వీస్ ఖర్చులకు చెక్.. మారుతీ సుజుకి 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్' ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఉపశమనం కలిగించేందుకు 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్ (SMP)'ను ప్రారంభించింది. ఈ ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ పథకం ద్వారా వాహన సర్వీస్ ఖర్చులను ముందుగానే నిర్ణయించుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో లేబర్ ఛార్జీలు, విడిభాగాల ధరలు, ఇతర వినియోగ వస్తువుల ఖర్చులు పెరిగినా కస్టమర్లపై అదనపు భారం పడదు.

వివరాలు 

ప్రైవేట్,కమర్షియల్ వాహనాలకు అందుబాటులో..

ఈ స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్ ప్రైవేట్, కమర్షియల్ వాహన యజమానులిద్దరికీ అందుబాటులో ఉంటుంది.

కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలోనే కాకుండా, తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఏ మారుతీ సుజుకి అధీకృత వర్క్‌షాప్‌లోనైనా సాధారణ సర్వీస్ సమయంలో ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు.

ఇందులో కేవలం లేబర్ సర్వీస్, లేబర్‌తో పాటు విడిభాగాల సర్వీస్, కమర్షియల్ వాహనాల మైనర్ సర్వీస్, కస్టమర్ అవసరాలకు అనుగుణమైన సేవలు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ మార్పిడి ప్యాకేజీలు వంటి పలు ఎంపికలు ఉన్నాయి.

వివరాలు 

క్లచ్, బ్రేక్ విడిభాగాలకు అదనపు రక్షణ

ఈ ప్లాన్‌లో భాగంగా క్లచ్, బ్రేక్ వంటి ముఖ్యమైన విడిభాగాలకు అదనపు వేర్ అండ్ టియర్ కవరేజీ కూడా కల్పిస్తోంది.

తరచూ వినియోగం వల్ల దెబ్బతినే ఈ కీలక భాగాల నిర్వహణ ఖర్చుల నుంచి కస్టమర్లకు రక్షణ లభిస్తుంది.

ఈ పథకం ద్వారా కనీసం 10 శాతం వరకు లేబర్ ఛార్జీలపై ఆదా అవుతుందని, విడిభాగాలు, ఇతర వినియోగ వస్తువులపై కూడా అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని మారుతీ సుజుకి తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

దేశవ్యాప్తంగా ఏ అధీకృత వర్క్‌షాప్‌లోనైనా సేవలు

వాహన వినియోగాన్ని బట్టి ఈ స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్‌లో వివిధ కాలపరిమితి, కిలోమీటర్ల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ప్రైవేట్ వాహనాలకు రెండేళ్లు లేదా 20 వేల కిలోమీటర్ల నుంచి 10 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు కవరేజీ ఉంటుంది.

కమర్షియల్ వాహనాల కోసం 10 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్యంగా, ఈ పథకాన్ని ఎక్కడ కొనుగోలు చేసినా దేశంలోని ఏ మారుతీ సుజుకి అధీకృత సర్వీస్ సెంటర్‌లోనైనా ఉపయోగించుకోవచ్చు.

ADVERTISEMENT