పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మారుతీ సుజుకీ జిమ్మీ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ జిమ్మీ ఎట్టకేలకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లోకి రూ.12.7 లక్షల (ఎక్స్ షోరూం) ధరతో అడుగుపెట్టింది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో కూడిన ఆల్పా వేరియంట్‌లో టాప్ ధర రూ.15.05 లక్షలు ఉండనుంది. మారుతి సుజుకి జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీని భారత్ లో నెక్సా షోరూం ల ద్వారా రూ.11వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూన్ మధ్య నుంచి కస్టమర్లకు ఈ కార్లను డెలివరీ చేయనున్నట్లు డీలర్ తెలియజేశారు. 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈఎస్‌యూవీ 105 హెచ్ పీ శక్తిని, 134 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది.
మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖాకు గట్టి పోటీ ఇవ్వున్న మారుతి సుజుకీ జిమ్మీ
మ్యానువల్ వేరియంట్ లీటర్ కు 16.94 కి.మీ, అదే ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ కు 16.39 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. 5 డోర్లతో వస్తున్న ఈ కారుకు 210 ఎంఎం గ్రౌండ్ క్లియరన్స్ కూడా ఉంది. ఇందులో అల్ఫా ట్రిమ్ లో ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+, ఇన్ఫోటైన్ మెంట్, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లతో ముందుకొచ్చింది. అదే విధంగా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, మొత్తం ఏడు రంగుల్లో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. ఐదు డోర్లు ఉన్న ఈ వాహనం ఫోర్ సీటర్ కావడం గమనార్హం. ఈ వెహికల్ మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖాకు ఇది గట్టి పోటి ఇవ్వనుంది.