Loading...
Maruti Suzuki: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రం.. ప్రారంభించిన మారుతి సుజుకి
భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రం.. ప్రారంభించిన మారుతి సుజుకి

Maruti Suzuki: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రం.. ప్రారంభించిన మారుతి సుజుకి

వ్రాసిన వారు Moogati Shabari
Jul 31, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కేంద్రంలో నాలుగో ఉత్పత్తి యూనిట్ (ప్లాంట్-D)లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈకొత్త ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 2.5 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో హన్సల్పూర్ కేంద్రం మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.5 లక్షల యూనిట్ల నుంచి 10 లక్షల (1 మిలియన్) వాహనాలకు పెరిగింది. సుజుకి సంస్థ చరిత్రలో ఒకే తయారీ కేంద్రంలో ఏడాదికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించడం ఇదే తొలిసారి. ఈ విస్తరణతో హన్సల్పూర్ కేంద్రం ఒకే ప్రాంగణంలో అత్యధిక ప్యాసింజర్ వాహనాలను తయారు చేసే భారతదేశంలోని అతిపెద్ద ఆటో మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది.

వివరాలు

29 లక్షల యూనిట్లకు చేరిక..

ప్లాంట్-D కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం మారుతి సుజుకి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 29 లక్షల (2.9 మిలియన్) యూనిట్లకు చేరుకుంది.

హన్సల్పూర్ తయారీ కేంద్రంలో ఇప్పటివరకు కంపెనీ రూ.25,288.7 కోట్ల (రూ.2,52,887 మిలియన్) పెట్టుబడులు పెట్టగా, ఇందులో కొత్త ప్లాంట్-D నిర్మాణానికే సుమారు రూ.3,900 కోట్ల (రూ.39,000 మిలియన్) పెట్టుబడి పెట్టింది. కొత్త ప్లాంట్‌లో తొలిదశలో కంపెనీ ప్రతిష్ఠాత్మక బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) అయిన ఈ విటారా (e Vitara)ను తయారు చేయనున్నారు.

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన హన్సల్పూర్ కేంద్రంలో ప్రస్తుతం ఫ్రాంక్స్ (Fronx), బలెనో (Baleno), స్విఫ్ట్ (Swift)తో పాటు ఈ విటారా మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

వివరాలు

ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుదల..

అంతేకాకుండా, ఈ కేంద్రం మారుతి సుజుకికి కీలక ఎగుమతి హబ్‌గా ఎదిగి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విదేశీ ఎగుమతుల్లో దాదాపు 47 శాతం వాటాను అందించింది.

సుస్థిర రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మారుతి సుజుకి మరో కీలక అడుగు వేసింది.

ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా 2024 మార్చిలో హన్సల్పూర్ కేంద్రంలో దేశంలోనే తొలి ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్‌ను ప్రారంభించింది.

2023 మార్చి నుంచి ఇప్పటివరకు ఈ రైల్వే సదుపాయం ద్వారా 7.5 లక్షలకు పైగా వాహనాలను వివిధ ప్రాంతాలకు తరలించింది.

దీంతో వాహన రవాణాలో ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, కార్బన్ డైఆక్సైడ్ (CO₂) ఉద్గారాలు తగ్గి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గింది.

ADVERTISEMENT