e-Vitara: మారుతీ తొలి ఎలక్ట్రిక్ కారు e-విటారా లాంచ్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ e-విటారా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 2న ఈ ఎంతో ఎదురుచూస్తున్న మోడల్‌కు సంబంధించి ధరలను కంపెనీ వెల్లడించనుంది. మారుతీ మొదటి EV మార్కెట్లోకి రావడంలో వరుస వాయిదాలు పడిన నేపథ్యంలో, ఇప్పుడు అధికారిక తేదీ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో, గుజరాత్ ప్లాంటులో e-విటారా ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమై, యూరప్, యుకేలకు ఎగుమతి అవుతోంది.
ఉత్పత్తి ప్రత్యేకతలు
ఉత్పత్తి,ఎగుమతి వివరాలు
మారుతీ సుజుకీ గుజరాత్ ప్లాంటులో తయారవుతున్న e-విటారా, మొత్తం 10 రంగుల ఆప్షన్లు, మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 48.8kWh, 61.1kWh బ్యాటరీ ప్యాక్‌లతో రెండు ఆప్షన్లు ఇస్తున్నారు. ఇవి రెండూ సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ (FWD) సెటప్‌తో వస్తాయి. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
అధునాతన లక్షణాలు
చార్జింగ్, ముఖ్య ఫీచర్లు
DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే, e-విటారా బ్యాటరీని 0 నుంచి 80% వరకు కేవలం 50 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. కారులో లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్రైవ్ మోడ్‌లు, Suzuki Connect వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం TPMS, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వబడగా, డ్రైవర్ కోసం 10-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్ కూడా అందిస్తున్నారు.