LOADING...
శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్
647cc, V-ట్విన్ ఇంజిన్ తో MBP C650V క్రూయిజర్

శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 27, 2022
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనీస్ బ్రాండ్ MBP C650V క్రూయిజర్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. 2023 ప్రారంభం నుండి అందుబాటులో ఉంటుంది. అయితే ధర గురించి తయారీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా డిజైన్‌, అవసరమైన లైటింగ్, ట్విన్ ఎగ్జాస్ట్‌ల కోసం పూర్తి-LED సెటప్‌ తో వస్తుంది.దీనికి 647cc, V-ట్విన్ ఇంజిన్ ఉంది, గరిష్టంగా 68hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 175 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది పూర్తిగా నలుపు, నలుపు/ఎరుపు కలయిక రంగులలో వస్తుంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పిలియన్ బ్యాక్‌రెస్ట్‌తో స్ప్లిట్-స్టైల్ సీట్లు, హై-సెట్ హ్యాండిల్ బార్, యారో హెడ్-ఆకారపు అద్దాలు, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు ఈ బైక్ లో ఉన్నాయి.

MBP C650V

రక్షణ కోసం వెనక చక్రాలపై డిస్క్ బ్రేక్ లు

ఇందులో క్రూయిజర్ బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు స్క్రీన్‌ లు ఉన్నాయి. రైడర్ భద్రత కోసం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు రక్షణగా ఇందులో డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. హార్లే-డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ నుండి ప్రేరేపితమైన ఈ బైక్ అమ్మకానికి వచ్చినప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, సూపర్ మెటోర్ 650 వంటి వాహనాలను ఇష్టపడేవారిని ఆకర్షించచ్చు. ఇది భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది తెలీదు. మంచి స్పోర్ట్స్ లుక్ తో పాటు అద్భుతమైన పనితీరు ఉన్న ఈ బైక్ ధర, లభ్యత, భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు కోసం 2023 వరకు వేచి ఉండాల్సిందే.