LOADING...
Mercedes-Benz: మెర్సిడెస్‌-బెంజ్‌ కీలక నిర్ణయం..సెప్టెంబరు నుంచి కార్ల ధరల పెంపు
మెర్సిడెస్‌-బెంజ్‌ కీలక నిర్ణయం..సెప్టెంబరు నుంచి కార్ల ధరల పెంపు

Mercedes-Benz: మెర్సిడెస్‌-బెంజ్‌ కీలక నిర్ణయం..సెప్టెంబరు నుంచి కార్ల ధరల పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, సెప్టెంబరు నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రూపాయి,యూరో మారక విలువల మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ సంవత్సరం జనవరి, జూన్‌ నెలల్లో కార్ల ధరలను 1.5 శాతం చొప్పున పెంచినట్టు తెలిపింది. అదే తరహాలో, సెప్టెంబరు నెలలో కూడా మూడోసారి 1.5 శాతం మేర ధరలను పెంచనున్నట్లు మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ వివరించారు.

వివరాలు 

సంస్థ తయారు చేసే కార్లలో.. 70 శాతం భాగాలు ఐరోపా దేశాల్లో 

ఇటీవల యూరో విలువ తొలిసారిగా రూ.98ను అధిగమించి రూ.99కు చేరుకున్న విషయం గమనార్హం. తమ సంస్థ తయారు చేసే కార్లలో సుమారు 70 శాతం భాగాలు ఐరోపా దేశాల్లో తయారవుతున్నాయని ఆయన తెలిపారు. యూరో విలువ పెరుగుతుండటంతో, వ్యయభారం కూడా పెరుగుతోంది. దాంతో తమ కార్ల ధరలను సవరించడం తప్పనిసరైన చర్యగా మారిందని సంతోష్ అయ్యర్ వెల్లడించారు.