Mercedes-Benz: 2027 నాటికి 22 కొత్త కార్లు విడుదల చేయనున్న మెర్సిడెస్-బెంజ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ రాబోయే రెండేళ్లలో విస్తరించేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది.
మెర్సిడెస్-బెంజ్ 12కు పైగా కొత్త మోడళ్లను, ఎనిమిది రీడిజైన్ చేసిన కార్లను, రెండు వినూత్న కాన్సెప్ట్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
తాజా ఈ విస్తరణ వ్యూహం కంపెనీ ఎదుర్కొంటున్న డెలివరీ, లాభాల్లో తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుంది.
ముఖ్యంగా యుకె వంటి కీలక మార్కెట్లలో ఉత్పత్తిని, అమ్మకాలను స్థిరపరిచేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది.
Details
EQ ఎలక్ట్రిక్ వ్యూహంతో కొత్త లాంచ్‌లు
ఈ కొత్త వాహనాల విడుదల మెర్సిడెస్-బెంజ్ EQ ఎలక్ట్రిక్ వ్యూహంలో రెండో దశను సూచిస్తుంది.
ఈ ప్రణాళికలో భాగంగా సంస్థ కొత్త తరం మైల్డ్-హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను ప్రవేశపెట్టనుంది. దీంతో స్థిరమైన ఆటోమోటివ్ టెక్నాలజీ లక్ష్యానికి మరింత దగ్గరవ్వనుంది.
2025లో ఏం రాబోతోందంటే?
మెర్సిడెస్-బెంజ్ తన కొత్త మోడల్ రోలౌట్‌ను తృతీయ తరం CLA సెలూన్‌తో ప్రారంభించనుంది. ఈ కాంపాక్ట్ మోడల్ వచ్చే నెలలో అధికారికంగా ఆవిష్కరించనుంది.
దీని తరువాత మోడ్యులర్ మెర్సిడెస్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఐదు కాంపాక్ట్ కార్లను విడుదల చేయనుంది.
Details
ఎలక్ట్రిక్ CLA సెలూన్ ప్రత్యేకతలు
85kWh నికెల్-మెగనీస్-కొబాల్ట్ (NMC) బ్యాటరీతో 740కిమీ పైగా రేంజ్ అందించనుంది.
ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి రానుంది.
హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో CLA సెలూన్
ఎలక్ట్రిక్ CLA సెలూన్ విడుదలైన ఆరు నెలల తరువాత, హైబ్రిడ్ మోడల్ రానుంది.
1.5-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, గేర్‌బాక్స్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌తో 188hp పవర్ అందించనుంది.
ICE & EV వేరియంట్లతో CLA సెలూన్ మొదటి మెర్సిడెస్-బెంజ్ మోడల్ లైన్ అవుతుంది. - CLA సెలూన్ తర్వాత CLA షూటింగ్ బ్రేక్ వాగన్ విడుదల కానుంది.
మొదటగా ఎలక్ట్రిక్ వేరియంట్ విడుదల చేసి, పెట్రోల్ వేరియంట్‌ను 2025 చివర్లో ప్రవేశపెట్టనుంది.
ఈ రెండు వేరియంట్లు కూడా CLA డ్రైవ్‌ట్రెయిన్లను పంచుకోనున్నాయి.
Details
GLC SUV ఎలక్ట్రిక్ వేరియంట్ విడుదల
ఈ ఏడాది మరొక ముఖ్యమైన లాంచ్ రెండో తరం GLC SUV ఎలక్ట్రిక్ వేరియంట్. ఈ మోడల్ మ్యూనిచ్ మోటార్ షో (సెప్టెంబర్)లో ఆవిష్కరించనున్నారు.
భారీ ప్రణాళికల ద్వారా మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ICE మోడళ్లను కూడా నవీకరించుతూ, స్థిరమైన ఆటోమొబైల్ టెక్నాలజీకి మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది.