
MG M9 EV: ఎంజీ ఎం9 ఈవీ లాంచ్‌కు సిద్ధం.. 500 కి.మీ రేంజ్‌తో ఫ్యామిలీ లగ్జరీ ఎంపీవీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఎంజీ మోటర్ తమ ఫ్లాగ్‌షిప్ ఫుల్‌ఈఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీ ఎంజీ ఎం9 ఈవీను సోమవారం (జూలై 22) భారత్‌లో అధికారికంగా విడుదల చేయనుంది. ఇది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి భారత మార్కెట్‌లో ప్రవేశిస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం. ఈ మోడల్‌ను 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. కాగా ఇప్పటికే మే 2025 నుంచి రూ. 51,000 టోకెన్ డిపాజిట్‌తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
Details
ఎంజీ ఎం9 ఈవీ: విక్రయ విధానం, టార్గెట్ మార్కెట్
ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఎంజీ 'ఎంజీ సెలెక్ట్' అనే ప్రత్యేక ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నారు. అలాగే సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కూడా ఇదే నెట్‌వర్క్ ద్వారా లభ్యం కానుంది. టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ వాహనాలతో పోటీ పడేలా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఇది పూర్తిగా సీబీయూ రూపంలో దిగుమతి కావడం వల్ల ధర రూ. 65-70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశముంది.
Details
బ్యాటరీ, మోటార్, రేంజ్
90 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌తో దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ పవర్: 241 బీహెచ్‌పీ, టార్క్: 350 ఎన్‌ఎమ్ టాప్ స్పీడ్: 180 కిలోమీటర్లు/గంట 11 కేడబ్ల్యూ ఛార్జర్‌తో 5%-100% ఛార్జింగ్‌కు 8.5 గంటలు DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం - 30%-80% ఛార్జ్ కేవలం 30 నిమిషాల్లో
Details
డైమెన్షన్స్, డిజైన్
పొడవు: 5,270 mm, వెడల్పు: 2,000 mm, ఎత్తు: 1,840 mm వీల్‌బేస్: 3,200 mm టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ కంటే విశాలంగా ఉంటుంది క్లోజ్డ్ ట్రాపెజోయిడల్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌లాంప్స్, కనెక్టెడ్ DRLs ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్‌లు, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, రూఫ్ స్పాయిలర్, LED టెయిల్‌లైట్లు
Details
వేరియంట్లు, రంగులు
ప్రపంచవ్యాప్తంగా రెండు వేరియంట్లు - భారతంలో మాత్రం టాప్ వేరియంట్ మాత్రమే పేరు: ప్రెసిడెన్షియల్ లిమో అందుబాటులో ఉన్న రంగులు మెటల్ బ్లాక్ కాంక్రీట్ గ్రే పెర్ల్ లస్టర్ వైట్ ఇంటీరియర్: కాగ్నాక్ బ్రౌన్ లెథర్, స్వెడిష్ మిక్స్ ఫినిష్
Details
ఇంటీరియర్, విలాసవంతమైన ఫీచర్లు
7 సీట్ల మూడు వరుసల సీటింగ్ త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ రెండో వరుసలో: ఎలక్ట్రిక్ ఒట్టోమన్ సీట్లు మసాజ్, హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లతో టచ్‌స్క్రీన్ హ్యాండ్‌రెస్ట్ ద్వారా నియంత్రణ వెనుక ప్రయాణికులకు వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు డ్యూయల్-పేన్ సన్‌రూఫ్, షామోయిస్ ఇంటీరియర్ టచ్
Details
భద్రతా ఫీచర్లు, ADAS
7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్‌పీ, ఆటో హోల్డ్, టీపీఎమ్‌ఎస్ ADAS సూట్ ఫీచర్లు: అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ క్రూయిజ్ అసిస్ట్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లేన్ కీప్ అసిస్ట్ స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ 360-డిగ్రీ వ్యూ మానిటర్ యూరో NCAP, ఆస్ట్రేలియన్ NCAPలో 5 స్టార్ క్రాష్ రేటింగ్ మొత్తానికి ఎంజీ ఎం9 ఈవీ అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన ఇంటీరియర్, అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన ప్రీమియం ఎంపీవీ. ఇది ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో కొత్త ప్రమాణాలు స్థాపించనుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.