Page Loader
MG M9: ఎంజీ మోటార్‌ సెన్సేషన్‌.. భారత్‌లో లగ్జరీ ఎం9 లిమోసిన్‌ లాంచ్‌!
ఎంజీ మోటార్‌ సెన్సేషన్‌.. భారత్‌లో లగ్జరీ ఎం9 లిమోసిన్‌ లాంచ్‌!

MG M9: ఎంజీ మోటార్‌ సెన్సేషన్‌.. భారత్‌లో లగ్జరీ ఎం9 లిమోసిన్‌ లాంచ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ భారత మార్కెట్లో మరో మెట్టు ఎక్కింది. కంపెనీ తాజాగా హైఎండ్‌ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ఎం9 మోడల్‌తో అడుగుపెట్టింది. విలాసవంతమైన ఈ ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణతో చర్చనీయాంశంగా మారింది. ఎం9ను ప్రారంభ ఆఫర్‌ ధర రూ.69.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) సంస్థ ప్రకటించింది. ఈ కారు డెలివరీలు ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. కొనుగోలుదారులు ప్రస్తుతం రూ.1 లక్ష చెల్లించి ఎంజీ సెలక్ట్‌ వెబ్‌సైట్‌లో గానీ, దేశవ్యాప్తంగా 13 నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో గానీ బుక్ చేసుకోవచ్చు.

Details

బ్యాటరీ, రేంజ్‌ విషయాలు

ఎం9లో 90 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల ఎన్‌ఎంసీ బ్యాటరీను ఏర్పాటు చేశారు. ఒకసారి పూర్తి చార్జింగ్‌ చేస్తే 548 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ వాహనానికి 245 బీహెచ్‌పీ పవర్‌ ఉన్న మోటార్‌ను అమర్చారు. అలాగే 350 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారుల సౌకర్యార్థం 11 కిలోవాట్ల వాల్‌బాక్స్‌ చార్జర్‌తో పాటు 3.3 కిలోవాట్ల పోర్టబుల్‌ చార్జర్‌ను కూడా అందిస్తున్నారు. హై వోల్టేజీ బ్యాటరీపై లైఫ్‌టైమ్‌ వారంటీ, వాహనంపై మూడు ఏళ్లపాటు అన్‌లిమిటెడ్‌ కిలోమీటర్ల వారంటీని కంపెనీ ప్రకటించింది.

Details

లగ్జరీ ఇంటీరియర్‌ డిజైన్

ఎం9లో బిజినెస్‌ క్లాస్‌ విలాసాన్ని తలపించే అంతర్గత సౌకర్యాలు ఉన్నాయి. 16 రకాలుగా అడ్జస్ట్‌ చేసుకునే ప్రెసిడెన్షియల్‌ సీట్లు, వెంటిలేషన్‌, హీటింగ్‌, ఎనిమిది మసాజ్‌ ఫంక్షన్‌ గల ఇంటెలిజెంట్‌ ఆర్మ్‌రెస్ట్‌ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రీమియం లెదర్‌ సీట్లు, 13 స్పీకర్లతో కూడిన అధునాతన ఆడియో సిస్టమ్‌, 64 రంగుల యాంబియంట్‌ లైటింగ్‌, డ్యూయల్‌ యాట్చ్‌ స్టైల్‌ సన్‌రూఫ్‌, 1720 లీటర్ల స్టోరేజ్‌ సామర్థ్యం తదితర ఫీచర్లు కారును అత్యంత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. బాహ్యంగా ట్రాపెజోయిడ్‌ ఆకారంలో గ్రిల్‌, స్ప్లిట్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, వాటర్‌ఫాల్‌ స్టైల్‌ రియర్‌ ఎల్‌ఈడీ లైట్స్‌ దీన్ని మరింత స్టైలిష్‌గా నిలుపుతున్నాయి.

Details

 అత్యాధునిక సేఫ్టీ, టెక్నాలజీ

19 అంగుళాల కాంటీసీల్‌ సెల్ఫ్‌ సీలింగ్‌ టైర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈకారు మెటల్‌ బ్లాక్‌, కాంక్రీట్‌ గ్రే, పెర్ల్‌ లస్ట్రే వైట్‌ రంగులలో అందుబాటులోకి రానుంది. ఎం9 కారును అల్ట్రా హై స్ట్రెంత్‌ స్టీల్‌తో తయారు చేశారు.దీనికి యూరోఎన్‌క్యాప్‌, ఏఎన్‌క్యాప్‌ టెస్ట్‌లలో 5 స్టార్‌ రేటింగ్స్‌ లభించాయి. ఏడు ఎయిర్‌బ్యాగులు, అడాస్‌ లెవల్‌-2, డ్రైవర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కియా కార్నివాల్‌, టయోటా వెల్‌ఫైర్‌, లెక్సస్‌ ఎల్‌ఎంలకు ఇది గట్టి పోటీగా నిలవనుంది. కంపెనీ ఎండీ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ ఎంజీ ఎం9 కారుతో భారత లగ్జరీ ఈవీ విభాగం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇది గమ్యస్థానానికి మాత్రమే కాదు, అభిరుచులకు కూడా ప్రతిబింబమన్నారు.