Page Loader
MG Comet EV: భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. ఒక్కరోజులోనే 8వేల బుకింగ్స్!
భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. ఒక్కరోజులోనే 8వేల బుకింగ్స్!

MG Comet EV: భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. ఒక్కరోజులోనే 8వేల బుకింగ్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో వేగంగా పాపులారిటీ సంపాదిస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ(MG Comet EV)మరోసారి దృష్టి ఆకర్షిస్తోంది. 2024 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ మోడల్‌ ఇప్పటివరకు 27,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. తొలుత 38 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లభ్యమైన ఈ వాహనం, మే 2025లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 52.9 కేడబ్ల్యూహెచ్‌ ప్రో వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా, ఈ ప్రో వేరియంట్‌ లాంచ్ అయిన 24 గంటల్లోనే 8వేల బుకింగ్‌లు నమోదయ్యాయి. విండ్సర్ ఈవీకి మెట్రో నగరాల్లాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్-మెట్రో ప్రాంతాల్లో అమ్మకాల్లో 48 శాతం వాటా నమోదవడం విశేషం.

Details

కొనుగోలు ఖర్చు తగ్గించుకొనే అవకాశం

ఈవీకి బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో కూడిన వేరియంట్‌లు లభ్యమవుతున్నాయి. ఈ మోడల్‌లో వినియోగదారులు బ్యాటరీని అద్దెకు తీసుకునే విధంగా కొనుగోలు ఖర్చును తగ్గించుకోవచ్చు. BaaS ధరలు: రూ.10 లక్షల నుంచి రూ. 13.10 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్) పూర్తి యూనిట్‌తో ధరలు: రూ.14 లక్షల నుంచి రూ. 18.10 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్)

Details

డిజైన్ హైలైట్స్

విండ్సర్ ఈవీ డిజైన్ విషయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ప్రొజెక్టర్ లాంపులు అల్లాయ్ వీల్స్, బ్లాక్ అవుట్ పిల్లర్లు - ఫ్లోటింగ్ రూఫ్‌ రూపం కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్ కాంపాక్ట్ SUV, హ్యాచ్‌బ్యాక్, MPV స్టైల్‌ల సమ్మేళనం ఫీచర్లు విండ్సర్ ఈవీ ఇంటీరియర్‌లో ఆధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ టచ్‌ ఉంది 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే) 9 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360° కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్

Details

స్పెసిఫికేషన్లు & రేంజ్

38 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ వేరియంట్లు: 134 bhp పవర్, 200 Nm టార్క్ - 331 కిలోమీటర్ల రేంజ్ 52.9 కేడబ్ల్యూహెచ్‌ ప్రో వేరియంట్: అదే పవర్, టార్క్ - 449 కిలోమీటర్ల రేంజ్ ఈ స్పెసిఫికేషన్లు, డిజైన్, ధరల సరళీకరణ ద్వారా ఎంజీ విండ్సర్ ఈవీ భారత మార్కెట్‌లో టాప్ సెల్లర్‌గా నిలవడంలో కీలకంగా నిలిచాయి. ఇక వచ్చే నెలల్లో మరింత వేరియంట్లు, ఫీచర్ అప్‌డేట్స్‌ రావచ్చని అంచనాలు ఉన్నాయి.