Loading...
MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్‌ విడుదల.. ధర,రేంజ్, ఫీచర్లు అదుర్స్!  
ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్‌ విడుదల.. ధర,రేంజ్, ఫీచర్లు అదుర్స్!

MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్‌ విడుదల.. ధర,రేంజ్, ఫీచర్లు అదుర్స్!  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విండ్సర్ ఈవీలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. 'ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.17,99,800గా నిర్ణయించింది. విండ్సర్ ఈవీ అమ్మకాలు ప్రారంభమైన 24 నెలల్లోనే 80,000కు పైగా కుటుంబాలు ఈ కారును కొనుగోలు చేయడం కంపెనీకి విశేష విజయంగా నిలిచింది. ఈ ఆదరణకు గుర్తుగా, వినియోగదారులకు మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో కొత్త ఇండల్జ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

వివరాలు 

ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ డిజైన్

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌ను ప్రత్యేకమైన 'షాడో గోల్డ్' బాడీ కలర్‌లో అందిస్తున్నారు.

దీనికి భిన్నంగా ఉండే ఆల్‌ బ్లాక్ రూఫ్ కారుకు స్పోర్టీ రూపాన్ని ఇస్తుంది.

నలుపు రంగు సైడ్ మిర్రర్లు, 18 అంగుళాల బ్లాక్ అలాయ్ వీల్స్ వాహనం ఆకర్షణను మరింత పెంచుతాయి.

సీ-పిల్లర్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'INDULGE' బ్యాడ్జింగ్ ఈ ఎడిషన్‌ను సాధారణ మోడళ్ల నుంచి వేరు చేస్తుంది.

వీటితో పాటు క్రోమ్ ఫినిషింగ్ ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లు, బాడీ సైడ్ మోల్డింగ్‌లతో కూడిన ప్రత్యేక యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు.

వివరాలు 

బిజినెస్ క్లాస్‌ను తలపించే క్యాబిన్

ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ లోపలి భాగంలో 'అర్బన్ టాన్ అండ్ బ్లాక్' కలర్‌లో లేథరెట్ అప్‌హోల్‌స్టరీని ఏర్పాటు చేశారు.

ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై 'INDULGE' అక్షరాలను ఎంబ్రాయిడరీ చేశారు.

వెనుక సీటులో ప్రయాణించే వారికి వినోదాన్ని అందించేందుకు రూఫ్‌కు అమర్చిన 'ప్రివే స్క్రీన్'ను ప్రత్యేకంగా అందించారు.

ఈ ఫీచర్ కొత్త ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక 135 డిగ్రీల వరకు వెనక్కి వాల్చుకునే ఏరో లాంజ్ సీట్లు ప్రయాణంలో మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి.

వీటితో పాటు 'INDULGE' బ్రాండింగ్ ఉన్న ప్రీమియం పిల్లోలు,నెక్ కుషన్లు, వెనుక విండో సన్‌షేడ్లు, రెండు రంగుల థీమ్‌తో కూడిన 3డీ ఫ్లోర్ మ్యాట్లు, ప్రీమియం లెదర్ కీ కవర్‌ను అందిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బ్యాటరీ, పవర్, రేంజ్ వివరాలు

ఈ ఫీచర్లతో కారులో ప్రయాణించే వారికి విమానంలోని బిజినెస్ క్లాస్‌ను తలపించే విలాసవంతమైన అనుభూతి లభించేలా కంపెనీ రూపొందించింది.

సాంకేతిక అంశాల విషయానికొస్తే.. ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌లో 38 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 136 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 332 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

అంతేకాకుండా 45 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

విండ్సర్ ఈవీ విజయంపై కంపెనీ ఏమందంటే?

ఎంజీ విండ్సర్ తమ సంస్థ ప్రయాణంలోనే కాకుండా దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ కీలకమైన ఉత్పత్తిగా నిలిచిందని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా తెలిపారు.

కేవలం 24 నెలల్లోనే 80,000కు పైగా కుటుంబాలకు ఈ కారు చేరువ కావడం ఆనందంగా ఉందన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకుని తీసుకొచ్చిన ఇండల్జ్ ఎడిషన్ వినియోగదారుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మరింత ప్రీమియం డిజైన్, మెరుగైన క్యాబిన్ అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

విండ్సర్ ఈవీ విజయంపై కంపెనీ ఏమందంటే?

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మోడల్‌కు ఆదరణ లభించే అవకాశం ఉంది.

ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులు, కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి విశాలమైన క్యాబిన్, వెనుక సీటు వినోద సదుపాయాలు ఆకర్షణగా మారవచ్చు.

పండుగ సీజన్‌లో లగ్జరీ ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ మరో ఎంపికగా నిలవనుంది.

ADVERTISEMENT