LOADING...
Renault Kwid EV: సింగిల్​ ఛార్జ్​తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం
సింగిల్​ ఛార్జ్​తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం

Renault Kwid EV: సింగిల్​ ఛార్జ్​తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లో రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు. ఫ్రెంచ్ ఆటోమేకర్ తమ ఇతర మోడళ్లకు నిరంతరం అప్‌డేట్‌లు అందిస్తున్నప్పటికీ, క్విడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ఇప్పటివరకు ప్రదర్శనలో లేదు. అయితే ఈ నిరీక్షణ త్వరలోనే ముగిసే అవకాశం ఉంది. చెన్నైలో పరీక్షల సమయంలో రెనాల్ట్ క్విడ్ ఈవీ టెస్ట్ మోడల్ కెమెరాకు లక్ అయింది. ఈ టెస్ట్ మోడల్.. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో పూర్తిస్థాయి మార్పులు చేస్తూ పాత క్విడ్ ప్రత్యేకతలను కొనసాగించింది.

Details

డాసియా స్ప్రింగ్ ఈవీ ఆధారంగా రెనాల్ట్ క్విడ్ ఈవీ 

క్విడ్ ఈవీ డాసియా స్ప్రింగ్ ఈవీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది రొమేనియన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను బ్యాడ్జ్ మార్చి మళ్లీ విడుదల చేసే వర్షన్. అందువల్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయినప్పటికీ, డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు క్విడ్ ఈవీకి ప్రత్యేకతను ఇస్తాయి.

Details

క్విడ్ ఈవీ డిజైన్

ఎగ్జాస్ట్ సిస్టమ్: స్పై షాట్ల ప్రకారం, ఎగ్జాస్ట్ లేదు, కాబట్టి ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్. ముందు భాగం: కొత్త డిజైన్‌తో, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ పై భాగంలో, కింద హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, మూసిన గ్రిల్‌లో కొత్త రెనాల్ట్ లోగో. సైడ్ వ్యూ: పెట్రోల్ క్విడ్ మోడల్‌ను పోలి ఉంది, బాడీ క్లాడింగ్, చదరపు వీల్ ఆర్చ్‌లు, పాత డోర్ ఫ్లాప్‌లు, స్టీల్ వీల్స్, అదే బెల్ట్‌లైన్. వెనుక భాగం: వెనుక వైపు కొంచెం చిన్నగా, రూఫ్ స్పాయిలర్, కొత్త టెయిల్ లైట్స్ వై-ఆకారపు మోటిఫ్‌తో, కొత్త బంపర్, వెనుక విండో వైపర్.

Details

ఇంటీరియర్, టెక్నాలజీ

కొత్త క్యాబిన్: డ్రైవర్ కోసం కొత్త స్టీరింగ్ వీల్, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. టచ్‌స్క్రీన్: పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ యూఐ థీమ్. ఇతర ఫీచర్లు: హైట్ అడ్జస్ట్ డ్రైవర్ సీటు, లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, క్లైమేట్ కంట్రోల్, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్. అంతర్జాతీయ స్ప్రింగ్ ఈవీ Level-1 ADAS ఫీచర్ కలిగి ఉంది, కానీ భారత మోడల్‌లో ఉంటుందా చూడాలి.

Details

బ్యాటరీ, పవర్, రేంజ్ 

క్విడ్ ఈవీ డాసియా స్ప్రింగ్ ఈవీ వంటి బ్యాటరీ, పవర్. రెండు ఎలక్ట్రిక్ మోటార్ వేరియంట్లు: 45 బీహెచ్‌పీ (33 కిలోవాట్స్), 65 హెచ్‌పీ (48 కిలోవాట్స్). 26.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, పూర్తి ఛార్జ్‌తో గరిష్ట రేంజ్ 304 కిలోమీటర్లు. రెనాల్ట్ క్విడ్ ఈవీ భారత మార్కెట్‌లో మాస్-మార్కెట్ సెగ్మెంట్‌లో కొత్త అడుగువేయడానికి సిద్దమవుతుంది, డిజైన్, ఫీచర్స్, పవర్, రేంజ్ పరంగా పూర్తిగా ఆధునికంగా ఉంటుంది.