MG Cyberster: MG సైబర్‌స్టర్.. 500 యూనిట్ల అమ్మకాలతో ఎలక్ట్రిక్ సూపర్‌కార్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. తక్కువ ఇంధన ఖర్చు, ఆధునిక హైటెక్ ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా, ఈవీ కార్ల కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకు వచ్చి, వినియోగదారుల ఆకర్షణను పెంచుతున్నాయి. MG మోటార్స్ 2025లో "MG సైబర్‌స్టర్" అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఈ కారు మార్కెట్‌లో విడుదలైన మొదటి రోజులు నుంచే డిమాండ్‌ను పొందుతూ, రిలీజైన ఆరు నెలల్లోనే రికార్డ్-తోడరగొట్టే సేల్స్ సాధించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఆరు నెలల్లో 500కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం MG సైబర్‌స్టర్ భారత మార్కెట్లో రూ. 74.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది.
వివరాలు
పూర్తి ఛార్జ్ తర్వాత.. 507 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు
ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కారు శక్తివంతమైన 77 kWh బ్యాటరీ మరియు మోటారుతో అందించబడింది. పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత ఇది 507 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 144 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని 10% నుండి 80% వరకు కేవలం 38 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. కారులోని మోటారు 510 PS శక్తి, 725 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 195 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
వివరాలు
10.25 అంగుళాల వర్చువల్ క్లస్టర్
MG సైబర్‌స్టర్ వెనుక చక్రాల డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ కారులో 10.25 అంగుళాల వర్చువల్ క్లస్టర్, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7 అంగుళాల డ్రైవర్ టచ్‌స్క్రీన్ వంటి ఆధునిక ఫీచర్లు అందించింది. అదనంగా, బోస్ సౌండ్ సిస్టమ్, Y-ఆకారపు స్పోర్ట్స్ సీట్లు, 19-20 అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తి ఎలక్ట్రిక్ హుడ్, ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్‌ప్లే వంటి అనేక ఆకర్షణీయమైన లక్షణాలు కూడా ఈ కారులో ఉన్నాయి.