LOADING...
Bajaj chetak c25: బజాజ్‌ నుంచి చేతక్ C25: అతి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బజాజ్‌ నుంచి చేతక్ C25: అతి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Bajaj chetak c25: బజాజ్‌ నుంచి చేతక్ C25: అతి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ బజాజ్ ఆటో తన చేతక్ శ్రేణిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. చేతక్ C25 పేరుతో వచ్చిన ఈ స్కూటర్‌ను రూ. 91,399 (ఎక్స్‌షోరూమ్‌) ధరగా నిర్ణయించింది. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా లేదా సమీప బజాజ్ షోరూమ్‌లలో ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. చేతక్ సిరీస్‌లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న మోడళ్లలో ఇదే అతి తక్కువ ధర కలిగిన స్కూటర్‌గా కంపెనీ పరిచయం చేసింది. ధరను తగ్గించడంలో భాగంగా రేంజ్‌,టాప్ స్పీడ్ పరంగా కొంత తగ్గింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వినియోగదారులను లక్ష్యంగా ఈ మోడల్‌ను రూపొందించినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

2.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ

మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఓలా S1 X, హీరో విడా VX2, టీవీఎస్ ఆర్బిటర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ చేతక్ C25 గట్టి పోటీ ఇవ్వనుంది. సాంకేతిక వివరాల విషయానికి వస్తే, చేతక్ C25లో 2.5 kWh సామర్థ్యం గల బ్యాటరీను అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 113 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. గరిష్ఠ వేగాన్ని గంటకు 55 కిలోమీటర్లుగా నిర్ధారించారు. 750 వాట్ల ఛార్జర్‌తో సుమారు 3 గంటల 45 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయకుండా, చేతక్‌కు ప్రత్యేకమైన లుక్‌ను కొనసాగించారు. ఎప్పటిలాగే ముందుభాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్ ఇచ్చారు. టర్న్ ఇండికేటర్లను హ్యాండిల్‌బార్‌లోనే అమర్చారు.

వివరాలు 

ఆరు రంగుల్లో అందుబాటులో..

వెనుకవైపు బాడీకి సరిపోయేలా టెయిల్ ల్యాంప్, దాని ఇరువైపులా టర్న్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. గ్రీన్‌, వైట్‌, బ్లాక్‌, గ్రే, రెడ్‌, యెల్లో కలర్ ఆప్షన్లను వినియోగదారులకు అందిస్తున్నారు. ఇందులో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. కాల్‌, ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కీతో కూడిన ఇగ్నిషన్ సిస్టమ్ ఇచ్చారు. సీటు కింద 25 లీటర్ల స్టోరేజీ స్పేస్ ఉంటుంది. అదనంగా రివర్స్ అసిస్ట్‌, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సౌకర్యాలను కూడా ఇందులో కలిపారు.

Advertisement