LOADING...
Komaki MX16 Pro: కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్: ఎంఎక్స్16 ప్రో - 200 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్.. ధర ఎంతంటే?
కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్: ఎంఎక్స్16 ప్రో - 200 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్.. ధర ఎంతంటే?

Komaki MX16 Pro: కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్: ఎంఎక్స్16 ప్రో - 200 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పూర్తిస్థాయి మెటల్ బాడీతో రూపొందించిన కోమాకి ఎంఎక్స్16 ప్రో ఎలక్ట్రిక్ క్రూయిజర్, ప్రమాదాల సమయంలో దెబ్బతినకుండా నిలబెట్టేలా, దీర్ఘకాలం విశ్వసనీయతను అందించేలా ఇంజనీరింగ్ చేయబడింది. స్ట్రెచ్డ్ ఫ్రేమ్, వెడల్పాటి సీటింగ్, తక్కువ వైబ్రేషన్ సెట్‌అప్‌తో రైడింగ్ అనుభూతి మరింత స్థిరంగా ఉండేలా కంపెనీ దీన్ని క్రూయిజర్ స్టైల్‌లో తీర్చిదిద్దింది. కోమాకి ఎంఎక్స్16 ప్రో: పనితీరు & రేంజ్ ఎంఎక్స్16 ప్రోలో 5 కిలోవాట్ బీఎల్‌డీసీ హబ్ మోటార్, 4.5 కిలోవాట్-అవర్ బ్యాటరీ జత చేయబడింది.ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 160-220 కి.మీ వరకు రేంజ్ లభిస్తుందని కోమాకి చెబుతోంది. సుమారు 200 కి.మీ ప్రయాణానికి కేవలం రూ.15-20 ఖర్చవుతుందని, ఇదే దూరం పెట్రోల్ బైక్‌లో వెళితే రూ.700వరకు అయ్యే విషయాన్ని కంపెనీ హైలైట్ చేసింది.

Details

కోమాకి ఎంఎక్స్16 ప్రో: భద్రత & రైడ్ నాణ్యత 

మోటార్ 6.7 హెచ్‌పీ పవర్ ఇచ్చి, బైక్ గరిష్టంగా 80 కి.మీ/గంట వేగం అందుకుంటుంది. వివిధ రోడ్డు పరిస్థితులలో సాఫీగా నడవడానికి టార్క్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. రైడింగ్ సమయంలో స్థిరత్వాన్ని పెంచడానికి ఈ క్రూయిజర్‌లో ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సెటప్ అందించారు. వెడల్పాటి సీటింగ్, సాఫీ టార్క్ డెలివరీ, సౌకర్యవంతమైన ఫ్రేమ్ అన్ని కలిసి ఎలాంటి అలసట లేకుండా రైడింగ్ అనుభూతిని ఇవ్వాలని కంపెనీ పేర్కొంది. కోమాకి ఎంఎక్స్16 ప్రో: ఫీచర్లు రోజువారీ వినియోగంలో సౌలభ్యాన్ని పెంచేందుకు ఎంఎక్స్16 ప్రో అనేక ఆధునిక ఫీచర్లతో వచ్చింది:

Details

కోమాకి స్పందన

ఫుల్-కలర్ TFT డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ క్రూయిజ్ కంట్రోల్ రివర్స్ అసిస్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆటో-రిపేర్ స్విచ్ పార్క్ అసిస్ట్ ఈ లాంచ్‌పై కోమాకి ఈవీ సహ-వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ—పనితీరు, సాంకేతికత, సౌకర్యం అన్నీ కలగలిపి ఎంఎక్స్16 ప్రోను రూపొందించామని చెప్పారు. ఇది బ్రాండ్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని, డైలీ కమ్యూట్‌లతో పాటు వారాంతపు రైడ్‌లను కూడా మరింత ఆనందదాయకం చేస్తుందని తెలిపారు.