Ather EL01-based electric scooter: ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ ఈ-స్కూటర్.. డిజైన్ పేటెంట్‌తో క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఏథర్ ఎనర్జీ నుంచి మరో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. ఇందుకు సంబంధించి భారత్‌లో కొత్త ఈ-స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను కంపెనీ దాఖలు చేసింది. ఈ స్కూటర్ EL01 కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజా పేటెంట్ ఫైలింగ్‌తో, ఏథర్ నెక్ట్స్ జనరేషన్ 'ఫ్యామిలీ స్కూటర్' ఎలా ఉండబోతోందనే విషయంపై స్పష్టమైన అంచనాలేర్పడ్డాయి.
Details
EL01 కాన్సెప్ట్ నేపథ్యం
EL01 అనే పేరు కొత్తది కాదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'ఏథర్ కమ్యూనిటీ డే 2025' కార్యక్రమంలో ఏథర్ తమ కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేస్తూ EL01 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది. అయితే ఆ సమయంలో ఈ కొత్త ఆర్కిటెక్చర్‌ను ఏ మోడల్‌తో ప్రారంభిస్తారు? ఎప్పుడు లాంచ్ చేస్తారు? అనే విషయాలను కంపెనీ వెల్లడించలేదు. ఇప్పుడు డిజైన్ పేటెంట్ దాఖలు చేయడంతో, ఈ ప్రాజెక్ట్ ఉత్పత్తి దశకు మరింత దగ్గరైనట్లు తెలుస్తోంది. పేటెంట్‌లో కనిపిస్తున్న డిజైన్, బహిరంగంగా ప్రదర్శించిన EL01 కాన్సెప్ట్‌ను చాలావరకు పోలి ఉంది.
Details
డిజైన్
ఇది స్పోర్టీ స్కూటర్‌గా కాకుండా, స్పష్టంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మోడల్‌లా కనిపిస్తోంది. క్లీన్, ఆచరణాత్మక డిజైన్ దీనికి ప్రధాన ఆకర్షణ. ప్రధాన లక్షణాలు చదునైన, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సింగిల్ పీస్ సీటు, వెనుక కూర్చునే వారి సౌలభ్యం కోసం పెద్ద గ్రాబ్ రైల్‌ను ఇందులో అందించారు. లైటింగ్ పేటెంట్ చిత్రాల ప్రకారం, హెడ్‌ల్యాంప్‌ను హ్యాండిల్‌బార్‌పై అమర్చారు. ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్‌ను ఫ్రంట్ ఏప్రాన్‌పై ఇచ్చారు. మొత్తం స్కూటర్ డిజైన్ నిటారుగా, సాంప్రదాయ శైలిలో ఉంది.
Details
తేడాలు
పేటెంట్ వెర్షన్‌లో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కాన్సెప్ట్ మోడల్‌లో ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ సెటప్‌ను చూపించారు. ఫీచర్లు EL01 కాన్సెప్ట్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూపించారు. పేటెంట్‌లో ఫీచర్ల స్థాయి పూర్తిగా నిర్ధారణ కాలేదుగానీ, ఫైనల్ ప్రొడక్ట్‌లో స్క్రీన్ ఆధారిత డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని అంచనా.
Details
కొత్త EL ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత
ఈ EL01 స్కూటర్ ఏథర్ రూపొందించిన కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 26 లక్షల కిలోమీటర్లకు పైగా వాస్తవ ప్రపంచ రైడింగ్ డేటాను ఉపయోగించి ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను మాడ్యులర్‌గా రూపొందించారు. అంటే, ఒకే ఆర్కిటెక్చర్‌పై వివిధ సైజులు, రకాలూ, అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను తయారు చేయవచ్చు. ఇందులో యూనిబాడీ స్టీల్ ఛాసిస్‌ను ప్రవేశపెట్టారు. ఇది మన్నికను పెంచడమే కాకుండా తయారీ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తుంది. ఏథర్ ప్రకారం, ఈ కొత్త నిర్మాణంతో స్కూటర్ అసెంబ్లీ ప్రక్రియ సుమారు 15 శాతం వేగంగా పూర్తవుతుంది. భాగాలు సరళంగా ఉండటం, బ్రేక్ అరుగుదల తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది.
Details
మార్కెట్‌పై ప్రభావం
అలాగే సర్వీసింగ్ విరామాలను 10,000 కిలోమీటర్ల వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ఏథర్ ఎనర్జీకి ఇప్పటికే 'ఏథర్ రిజ్టా' రూపంలో ఒక బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఇప్పుడు EL01 మోడల్ మార్కెట్‌లోకి వస్తే, ఫ్యామిలీ ఈ-స్కూటర్ సెగ్మెంట్‌లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.