
నూతన టెక్నాలజీతో వస్తున్న Aui S3, RS3.. ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు.
ఒకప్పుడు ఇవి ఏ కొద్ది మంది దగ్గరో ఉండేవి, కానీ ఇప్పుడు హైదరాబాద్, దిల్లీ, ముంబై వంటి నగరాల్లో బోలెడు కన్పిస్తున్నాయి.
ప్రస్తుతం ఆడి 2026 నుండి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారించనుంది.
ఐదు డోర్ల స్పోర్ట్ బ్యాక్‌తో పాటు దాని S3, RS3 సెడాన్‌ల నూతన వర్షన్‌లను ఆవిష్కరించింది.
ఇందులో కొత్త లైట్లు, బంపర్లను అధునాతంగా అమర్చారు.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతదేశంలో మరింత విస్తరించాలని చూస్తోంది.
Details
మరింత సమాచారాన్ని త్వరలోనే తెలియజేయనున్న ఆడి సంస్థ
వెనుకవైపు S3, RS3 రెండూ అప్‌డేట్ చేయబడిన టెయిల్‌లైట్ డిజైన్‌లు ఉండనున్నాయి.
మరోవైపు హుడ్ కింద ఏవైనా సవరణలు చేసే అవకాశం ఉంది.
S3 ప్రస్తుతం ఐరోపాలో 310hpని, ఇతర ప్రాంతాలలో 306hp శక్తిని అందిస్తోంది.
అయితే Volkswagen Golf R 329hp శక్తిని అందిస్తోంది. ఇక RS3 ప్రస్తుతం 401hp శక్తిని కలిగి ఉంది.
ఈ నూతన వర్షన్ల గురించి మరింత సమాచారాన్ని త్వరలోనే ఆడి సంస్థ తెలియజేయనుంది.