
Car Offers: దీపావళికి ఆ కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా 90వేల తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
పండుగ సీజన్‌తో కార్ల మార్కెట్లు కళకళలాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
ఇప్పటికే హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా, స్కోడా స్లావియా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేశాయి.
ఇటీవల ప్రవేశపెట్టిన హ్యుందాయ్ వెర్నాకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. దీనిపై ఏకంగా రూ.30వేల తగ్గింపును కంపెనీ ప్రకటించింది.
మారుతి సుజుకి డిజైర్ కు 90hp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, లేదా 77hp 1.2-లీటర్ CNG పవర్‌ట్రెయిన్‌ను అమర్చవచ్చు.
పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఎంపికలతో ఇది అందుబాటులో ఉంది,
పండుగ సీజన్ దృష్ట్యా దీనిపై రూ.40వేలను తగ్గించారు.
Details
నవంబర్ 30వరకే ఆఫర్
హోండా అమేజ్‌లో విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది. దీనిపై ఆ సంస్థ ఏకంగా 70వేలను తగ్గించింది.
వెర్నా, వర్టస్‌లకు స్కోడా స్లావియా సిటీ మార్కెట్లోకి గట్టి పోటీగా నిలుస్తోంది.
ఇది రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అమర్చారు. దీనిపై 75వేల వరకూ తగ్గిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
వోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై రూ. 80వేల వరకు తగ్గించారు. ఇందులో ప్రత్యేకమైన డిజైన్, ఇంటీరియర్ ఫీచర్‌లు, డ్రైవింగ్ అనుభవంతో విభిన్నంగా ఉంటుంది.
ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది.
ఇక హోండా సిటీకి ఏకంగా రూ.90వేల వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే పెట్రోల్ వేరియంట్‌కు మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రకటించారు.