Honda Activa 125cc: నయా లుక్‌లో ఆక్టివా 125 స్కూటర్.. ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన బెస్ట్-సెల్లింగ్ 'స్కూటర్ ఆక్టివా 125'ను కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ ధర రూ.94,422 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఆక్టివా 125లో వినూత్న డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు, ఆధునిక సాంకేతికతను చేర్చారు. కొత్త ఆక్టివా 125లో 124cc 4-స్ట్రోక్ SI ఇంజిన్‌ని అమర్చారు. ఇది 6.11bhp మాక్సిమమ్ పవర్, 10.4Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎఫీషియెన్సీ, అలాగే రైడర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంలో కీలకంగా పని చేస్తుంది.
ఐదు వేరియంట్స్ లో అందుబాటులో
ఇది 5 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మేటలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మేటలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్ వంటి రంగుల్లో లభించనుంది. ఈ స్కూటర్‌లో 4.2 ఇంచుల TFT డిస్ ప్లే ఉంటుంది. ఇది హోండా రోడ్సింక్ యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్ వంటి సౌకర్యాలను ఈ డిస్ ప్లే ద్వారా రైడర్లు సులభంగా పొందవచ్చు. అదనంగా USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
హోండా డీలర్‌షిప్‌లలో కొత్త ఆక్టివా 125 స్కూటర్
ఇది అత్యవసర సమయంలో డివైస్లను ఛార్జ్ చేయడం సులభతరం చేస్తుంది. కొత్త ఆక్టివా 125 ఐకానిక్ డిజైన్‌ను కొనసాగిస్తూ, ప్రీమియమ్ టచ్ కోసం కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్, ఇన్నర్ ప్యానెల్‌లను అందిస్తుంది. ఈ స్కూటర్ మొత్తం పొడవు 1850mm, వెడల్పు 707mm, ఎత్తు 1170mm, 1260mm వీల్‌బేస్ కలిగి ఉంది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.