Page Loader
Scorpio N Z8T : కొత్తగా స్కార్పియో ఎన్‌ Z8T వేరియంట్‌ లాంచ్‌.. ధరలు, ఫీచర్లు ఇవే!
కొత్తగా స్కార్పియో ఎన్‌ Z8T వేరియంట్‌ లాంచ్‌.. ధరలు, ఫీచర్లు ఇవే!

Scorpio N Z8T : కొత్తగా స్కార్పియో ఎన్‌ Z8T వేరియంట్‌ లాంచ్‌.. ధరలు, ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ను అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది. లెవల్‌-2 అడాస్‌ టెక్నాలజీతో స్కార్పియో ఎన్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ Z8Lను కొత్తగా తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధర రూ.21.35 లక్షలు కాగా, మరో కొత్త వేరియంట్‌ Z8Tను కూడా లాంచ్‌ చేసింది. దీని ధర రూ.20.29 లక్షలు. స్కార్పియో ఎన్‌-కొత్త వేరియంట్లు ఫీచర్లు Z8L వేరియంట్‌ 6, 7 సీటర్ల ఆప్షన్లతో లభిస్తుంది. ఇది మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో పాటు 2WD, 4WD వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 2.0లీటర్‌ టర్బో పెట్రోల్‌, 2.2లీటర్‌ డీజిల్‌ ఇంజిన్ల ఎంపికలు ఉన్నాయి.

Details

లెవల్‌-2 ADAS ఫీచర్లు

Z8L వేరియంట్‌లో సమృద్ధిగా 10 అడ్వాన్స్డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి ఫార్వర్డ్‌ కొలిషన్‌ వార్నింగ్‌ లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌ లేన్‌ కీప్‌ అసిస్టెన్స్‌ అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ విత్‌ స్టాప్‌ అండ్‌ గో హై బీమ్‌ అసిస్టెన్స్‌ స్మార్ట్‌ పైలట్‌ అసిస్టెన్స్‌ ట్రాఫిక్‌ సైన్‌ రికగ్నిషన్ స్పీడ్‌ లిమిట్‌ అసిస్టెన్స్‌ ఫ్రంట్‌ వెహికల్‌ స్టార్ట్‌ అలర్ట్

Details

స్కార్పియో ఎన్‌ Z8T

కొత్తగా పరిచయమైన Z8T వేరియంట్‌ Z8 శ్రేణిలో మధ్యస్థ స్థాయిగా ఉంటుంది. ఇది కూడా అన్ని పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది ప్రీమియం ఫీచర్లు 12 స్పీకర్ల సోనీ ఆడియో సిస్టమ్ ఫ్రంట్‌ కెమెరా ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సార్లు ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్ ఆటో డిమ్మింగ్‌ రియర్‌వ్యూమిరర్లు 18-ఇంచ్‌ డైమండ్ కట్‌ అల్లాయ్‌ వీల్స్ వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు 6-వే పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీటు

Details

ఇంజిన్‌ స్పెసిఫికేషన్లు

2.0 లీటర్‌ ఎంస్టాలియన్‌ టర్బో పెట్రోల్‌ - 200 bhp పవర్‌, 380 Nm టార్క్‌ 2.2 లీటర్‌ ఎంహాక్‌ డీజిల్‌ Z2 వేరియంట్‌ - 130 bhp, 300 Nm Z4 మరియు పై వేరియంట్లు - 172 bhp, 400 Nm 4WD వేరియంట్లు 4XPLOR టెర్రైన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో వస్తాయి. ఇవి డీజిల్‌ మోడళ్లకే పరిమితమై ఉంటాయి.