Toyota Vellfire 2023: ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. మన ఇండియన్ రోడ్లపై కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే. ఈ ఏడాది టయోటా కిర్లోస్కర్ మోటర్ ఆగస్టులో కొత్త 2023 వెల్‌ఫైర్ లగ్జరీ ఎమ్‌పివిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది వెహికల్ హై, VIP ఎగ్జిక్యూటివ్ లాంచ్ అనే రెండు వేరియెంట్‌లలో వస్తోంది. వీటి ధరలు రూ.1.20 కోట్ల నుండి రూ.1.30 కోట్ల మధ్యలో ఉండనున్నాయి. ఈ ఎంపీవీ మునపటి వర్షెన్ పోలిస్తే ధర ఎక్కువగా ఉంది. కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్న 14 నెలల వరకు వేచి ఉండాల్సిందే. లొకేషన్ కాకుండా, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్, కలర్ ఆప్షన్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంది.
టయోటా వెల్ఫేర్ కు అధిక డిమాండ్
చైనా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ మొదలైన అంతర్జాతీయ మార్కెట్‌లలో టయోటా వెల్ ఫైర్ కు అధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో కొన్ని డీలర్ షిప్ లు ఈ వెహికల్ బుకింగ్స్ ఆపేశాయి. ఎందుకంటే కస్టమర్లు ఏడాదికి మించి వేచి ఉండకూడదు అనే నిబంధన ఉంది. మలేషియాలో కూడా ఆల్ఫార్డ్/వెల్‌ఫైర్ ఇదే విధంగా డిమాండ్ ఉంది. టయోటా కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, లేన్-కీప్ అసిస్ట్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, నాలుగు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.