Page Loader
Toyota: హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే?
హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే?

Toyota: హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా ఇటీవలే రుమియన్ ఎంపీవీని లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ వెహికల్‌ని రూపొందించారు. టయోటా రుమియన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో వీటి ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. హైదరాబాద్‌లో రుమిన్ ఎస్ వేరియంట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ.12. 76 లక్షలు ఉండగా, జీ వేరియంట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ.14.17 లక్షలు, వీ వేరియంట్ రూ. 15.06 లక్షలుగా ఉంది. అయితే టయోటా రుమియన్ ఎపీవీలో ఎస్ ఎంట్రీ (పెట్రోల్) ఎక్స్ షో రూం ధర రూ. 10.29 లక్షలుగా ఉంది.

Details

టయోటా బుకింగ్స్ ప్రారంభం

జీ ఎంటీ (పెట్రోల్​) ఎక్స్​షోరూం ప్రైజ్​ రూ. 11.45లక్షలు, వీ ఎంటీ (పెట్రోల్​) ధర రూ. 12.18లక్షలు, వీ ఏటీ (పెట్రోల్​) ఎక్స్​షోరూం ధర రూ. 13.68లక్షలుగా ఉంది. టయోటా రుమియన్ బుకింగ్స్ కి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. రూ.11 వేల టోకెన్ అమౌంట్‌తో టయోటా సంస్థకు చెందిన డీలర్ షిప్ షోరూంలో ఈ వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈనెల 8 నుంచి డెలివరీలు మొదలవుతాయని సంస్థ పేర్కొంది. రుమియన్​ స్పంకీ బ్లూ, రస్టిక్​ బ్రౌన్​, ఐకానిక్​ గ్రే, కేఫ్​ వైట్​, ఎంటైసింగ్​ సిల్వర్​ వంటి రంగుల్లో రానుంది.