Nissan Gravite : రూ.5.6 లక్షలకే నిస్సాన్ గ్రావిట్ బేస్ వేరియంట్.. 7 సీటర్ ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.65 లక్షల నుంచి ప్రారంభమవుతున్న ఈ మోడల్ బేస్ వేరియంట్, తక్కువ ఖర్చుతో 7-సీటర్ వాహనం కోరుకునే కుటుంబాలకు మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ బేస్ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
Details
ఎక్స్‌టీరియర్ డిజైన్
బేస్ వేరియంట్ అయినప్పటికీ గ్రావైట్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. నిస్సాన్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, మజిల్ లైన్స్‌తో కూడిన బోనెట్ దీనికి ఎస్‌యూవీ తరహా గంభీరమైన రూపాన్ని ఇస్తాయి.
హెడ్‌ల్యాంప్స్: హాలోజన్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
వీల్స్: స్టీల్ వీల్స్ అందించారు. వీల్ కవర్లు ఉండటంతో లుక్ బాగుంటుంది.
బాడీ క్లాడింగ్: వీల్ ఆర్చెస్ చుట్టూ మరియు బాడీ దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వడం వల్ల రగ్గడ్ అప్పీల్ కనిపిస్తుంది. బంపర్లు మాత్రం బాడీ కలర్‌లోనే ఉంటాయి.
Details
క్యాబిన్, కంఫర్ట్
7 సీటర్ గ్రావైట్ లోపల బ్లాక్ థీమ్‌తో ఫ్యాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ ఉంటుంది. డాష్‌బోర్డ్ డ్యూయల్ టోన్ ఫినిష్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ: రెండో వరుస సీట్లు స్లైడ్, రెక్లైన్ చేయవచ్చు. మూడో వరుసలోకి సులభంగా వెళ్లేందుకు 60:40 స్ప్లిట్, ఫోల్డ్ అండ్ టంబుల్ ఫంక్షన్ ఇచ్చారు.
బూట్ స్పేస్: అవసరమైతే మూడో వరుస సీట్లను పూర్తిగా తొలగించి బూట్ స్పేస్ పెంచుకోవచ్చు.
విండోస్ & ఓఆర్వీఎం: ముందుభాగంలో పవర్ విండోస్ ఉంటాయి. వెనుకవైపు మాన్యువల్ విండోస్ మాత్రమే ఉంటాయి. ఓఆర్వీఎం కూడా మాన్యువల్‌గా సర్దుకోవాలి.
Details
లభించని ఫీచర్లు ఇవే
బేస్ వేరియంట్ కావడంతో కొన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేవు.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ లేవు.
వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సదుపాయం లేదు.
పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ ఫీచర్లు లేవు.
మాన్యువల్ ఏసీ ఉన్నప్పటికీ వెనుకవైపు ఏసీ వెంట్స్ లేవు.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చిన్న 3.5 ఇంచ్ డిస్‌ప్లే మాత్రమే ఉంటుంది.
రియర్ కెమెరా, రియర్ వైపర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు లేవు.
Details
భద్రతా ఫీచర్లు
భద్రత విషయంలో నిస్సాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బేస్ వేరియంట్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించడం విశేషం. అదనంగా:
ఏబీఎస్ విత్ ఈబీడీ
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
హిల్ స్టార్ట్ అసిస్ట్
రియర్ పార్కింగ్ సెన్సార్స్
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)
ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్
Details
ఇంజిన్, పనితీరు
గ్రావైట్ బేస్ వేరియంట్‌లో 72 పీఎస్ గరిష్ట పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేసే పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.
దీనికి మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ వాహనం ప్రధానంగా సిటీ డ్రైవింగ్, ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఏఎంటీ ఆప్షన్ అందుబాటులో లేదు.
తుది మాట
తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్, అవసరమైనంత స్పేస్, ప్రాథమిక సౌకర్యాలు మెరుగైన భద్రతా ఫీచర్లు కోరుకునే వారికి నిస్సాన్ గ్రావైట్ బేస్ వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.