LOADING...
Nissan Gravity MPV: ట్రైబర్ ఆధారంగా నిస్సాన్ గ్రావిటే.. 7 సీటర్ ఎంపీవీ వివరాలివే! 
ట్రైబర్ ఆధారంగా నిస్సాన్ గ్రావిటే.. 7 సీటర్ ఎంపీవీ వివరాలివే!

Nissan Gravity MPV: ట్రైబర్ ఆధారంగా నిస్సాన్ గ్రావిటే.. 7 సీటర్ ఎంపీవీ వివరాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జపాన్ దిగ్గజం 'నిస్సాన్' ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ట్రైబర్ ఆధారిత సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావిటే'ని పరిచయం చేయనుంది. ఈ కారు 2026 మార్చి నాటికి షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇది కేవలం ట్రైబర్‌కు రీబ్యాడ్జ్ వర్షన్‌గా మిగిలిపోతుందా? లేక కొత్తదనం ఉంటుందా? అన్న ఆసక్తి నెలకొంది.

Details

నిస్సాన్ గ్రావిటే.. జనవరి 21న గ్రాండ్ ఎంట్రీ

వచ్చే ఏడాది జనవరి 21న 'గ్రావిటే' ఎంపీవీని అధికారికంగా ఆవిష్కరించేందుకు నిస్సాన్ సిద్ధమవుతోంది. ఈ ఎంపీవీ తర్వాత 2026 మధ్యలో 'టెక్టాన్' ఎస్‌యూవీని, అలాగే 2027లో మరో భారీ 7-సీటర్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన గ్రావిటే టీజర్లు.. ఈ ఎంపీవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Details

డిజైన్‌లో మార్పులు.. ట్రైబర్‌కు వారసుడిగా!

గ్రావిటే ముందు వెనుక డిజైన్‌లను గమనిస్తే ఇది రెనాల్ట్ ట్రైబర్‌కు రీబ్యాడ్జ్ వర్షన్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే స్టైలింగ్‌లో మాత్రం నిస్సాన్ కొన్ని మార్పులు చేసింది. ప్రధానంగా ముందుభాగంలో పెద్ద గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. బంపర్ వద్ద ఉన్న 'సీ' ఆకారపు ట్రిమ్స్ కారు మరింత వెడల్పుగా కనిపించేలా చేస్తున్నాయి. వెనుకవైపు 'గ్రావిటే' పేరు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు.

Advertisement

Details

లోపల లగ్జరీ టచ్‌.. ఫీచర్లు ఇవే

ఇంటీరియర్ పరంగా నిస్సాన్ ఈ ఎంపీవీకి 'అల్ట్రా-మాడ్యులర్' సీటింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. అవసరాన్ని బట్టి సీట్లను మార్చుకునే వీలుంటుంది. నిస్సాన్ గ్రావిటేలో ఉండే ప్రధాన ఫీచర్లు 7-ఇంచ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ స్టోరేజ్ బాక్స్ రెండో వరుసలో స్లైడింగ్, రీక్లైన్ అయ్యే సీట్లు చిన్న కారే అయినప్పటికీ ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా దీనిని డిజైన్ చేశారు. అయితే మూడో వరుసలో స్పేస్ కొంత పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Details

ఇంజిన్ సామర్థ్యం ఎలా?

నిస్సాన్ గ్రావిటే ఇంజిన్ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 72 హెచ్‌పీ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదని అంచనా. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించనున్నాయి. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఇంజిన్‌లో కొన్ని చిన్న మార్పులు చేయవచ్చని సమాచారం.

Advertisement