Nissan Gravite: నిస్సాన్ గ్రావిటీ సీఎన్‌జీ వెర్షన్ భారత్‌లో లాంచ్ ..డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) కొత్తగా ఆల్ న్యూ నిస్సాన్ గ్రావిటీ కోసం ప్రభుత్వ ఆమోదం పొందిన CNG రీట్రోఫిట్ కిట్ ఆప్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కిట్‌లో సెగ్మెంట్‌లో తొలిసారిగా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ అందించారు. దీని ద్వారా 7-సీటర్ మాడ్యులర్ ఫంక్షనాలిటీ, యుటిలిటీ పూర్తిగా కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త నిస్సాన్ గ్రావిటీ సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 82,999గా నిర్ణయించారు. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది. తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి అనుకూలమైన మొబిలిటీ సొల్యూషన్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యమని నిస్సాన్ తెలిపింది. అలాగే మూడో వరుస సీటింగ్ స్పేస్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా డిజైన్ చేశారు.
వివరాలు
ఫీచర్లు ఇవే..
"స్మార్ట్ పవర్ విత్ స్మార్టర్ సేవింగ్స్" కాన్సెప్ట్‌తో ఈ CNG సిస్టమ్ రూపొందించారు. దీని ద్వారా కిలోమీటర్‌కు వచ్చే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రభుత్వ ఆమోదిత CNG కిట్‌ను మోటోజెన్ సంస్థ డెవలప్ చేసి, తయారు చేసి, క్వాలిటీ చెక్ చేసింది. వినియోగదారులు ఈ కిట్‌ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. అదనంగా, కిట్ భాగాలపై మూడేళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నారు. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్సా మాట్లాడుతూ, మాగ్నైట్ CNGకు వచ్చిన మంచి స్పందన తర్వాత ఇప్పుడు గ్రావిటీ కోసం ఈ కొత్త ట్విన్-సిలిండర్ సొల్యూషన్‌ను తీసుకొచ్చామని తెలిపారు.
వివరాలు
డైనమిక్ అడ్వాన్స్ టెక్నాలజీ..
7-సీటర్ MPVను రోజువారీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా మరింత ప్రాక్టికల్‌గా, సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. స్పేస్ లేదా యూజబిలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా CNG సొల్యూషన్‌ను రూపొందించినట్లు వివరించారు. టెక్నికల్‌గా చూస్తే, ఈ సిస్టమ్‌లో సీక్వెన్షియల్ BS6.2 కంప్లైంట్ CNG కిట్, ICAT ఆమోదిత సేఫ్టీ సిస్టమ్, 8.1 mm మందం ఉన్న హై-డ్యూటీ సిలిండర్లు ఉన్నాయి. అలాగే గ్రావిటీ కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసిన డైనమిక్ అడ్వాన్సర్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఫ్యూయల్ లిడ్ దగ్గర ఫిల్లింగ్ పాయింట్, ఫ్యాక్టరీ ఫినిష్ లుక్‌తో ఇన్‌స్టాలేషన్, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా రియర్ సీట్ లేఅవుట్ ఆప్టిమైజేషన్, అలాగే పెట్రోల్, CNG మధ్య సులభంగా మారే స్విచ్‌ఓవర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.