Nissan: ఆకట్టుకునే డిజైన్‌తో కొత్త జ్యూక్ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించిన నిస్సాన్
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో నిర్వహించిన విజన్ ఈవెంట్‌లో నిస్సాన్ తమ తాజా ఎలక్ట్రిక్ వాహనం మూడో తరం జ్యూక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎస్యూవీ పూర్తిగా విద్యుత్తుతో నడిచే విధంగా రూపొందించబడింది. కంపెనీ సిఎంఎఫ్-ఈవీ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేసింది. యూకేలోని సండర్ల్యాండ్ ప్లాంట్‌లో దీని తయారీ జరగనుంది. చిన్న మోడల్ అయిన Nissan Leafతో కొన్ని ముఖ్యమైన భాగాలు ఈ జ్యూక్ పంచుకోనుంది. 2024 హైపర్ పంక్ కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని డిజైన్‌ను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు. ముందు, వెనుక భాగాల్లో ప్రత్యేక లైట్ డిజైన్ ఇవ్వడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ బోల్డ్ డిజైన్‌తో కొత్త కస్టమర్లను ఆకర్షించగలమని నిస్సాన్ ప్రతినిధి క్లియోధ్నా లయన్స్ తెలిపారు.
వివరాలు
వినియోగదారులకు రెండు ఎంపికలు
అయితే కొత్త జ్యూక్ ఈవీ వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఉన్న రెండో తరం జ్యూక్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా కంపెనీ కొనసాగించనుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈవీ అమ్మకాలు ఆశించినంత వేగంగా పెరగకపోవడమే. అయినప్పటికీ యూరప్ విభాగ అధికారి మాసిమిలియానో మెస్సినా మాట్లాడుతూ, భవిష్యత్తు పూర్తిగా ఎలక్ట్రిక్ దిశగా ఉండబోతుందని, వినియోగదారులకు రెండు ఎంపికలు ఇవ్వడం వల్ల మార్పు సులభమవుతుందని చెప్పారు.
వివరాలు
జ్యూక్ ఈవీకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ప్రకటించని కంపెనీ
కొత్త జ్యూక్ ఈవీకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది లీఫ్ మోడల్‌లా ఉండే అవకాశముంది. లీఫ్‌లో 52kWh లేదా 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండగా, గరిష్టంగా 621 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. త్వరలో సండర్ల్యాండ్‌లో ట్రయల్ ఉత్పత్తి ప్రారంభమై, 2027 ప్రారంభంలో పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలై, స్ప్రింగ్ సీజన్ కి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.