Nitin Gadkari: పెట్రోల్,డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదు: నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో ఫాసిల్ ఫ్యూయల్ వాహనాలు కొనసాగవని, పరిశ్రమలు వెంటనే స్వచ్ఛ ఇంధనాల వైపు మళ్లాలని సూచించారు. బస్‌వరల్డ్ ఇండియా కాంక్లేవ్ 2025లో మాట్లాడుతూ బయోఫ్యూయల్స్, CNG, LNG, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాలని కోరారు. పెట్రోల్, డీజిల్ దిగుమతులు,కాలుష్యం పెద్ద సమస్యలని చెప్పారు. హైడ్రోజన్ వాహనాలపై ఇప్పటికే ట్రయల్స్ జరుగుతున్నాయని, దేశంలో 10 రూట్లలో హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులు నడుస్తున్నాయని తెలిపారు.
వివరాలు
వచ్చే మూడు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్
భవిష్యత్‌లో హైడ్రోజన్ ప్రధాన ఇంధనమవుతుందని చెప్పారు. ఇక ఎథనాల్ వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తూ, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రజా రవాణాలో భద్రతపై కూడా దృష్టి పెట్టిన ప్రభుత్వం, బస్సుల రిజిస్ట్రేషన్‌కు వీడియో ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఖర్చులు తగ్గించడం కంటే నాణ్యత, భద్రత, ప్రయాణికుల సౌకర్యం ముఖ్యమని తయారీదారులకు సూచించారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ భారీగా పెరగనుందని అంచనా.